Vastu Tips: ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉంటే ఎంత నష్టమో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..!
కొందరు ఇంట్లో చెట్లు, మొక్కలు కూడా వాస్తు పరంగానే పెంచుతుంటారు. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచటం వల్ల వాటి ఫలితాలు సానుకూలంగా, ప్రతికూలంగానూ ఉంటాయని భావిస్తారు. అలాంటిదే బొప్పాయి కూడా ఒకటి.. వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కరి కల.. దీనికోసమే నిరంతరం కష్టపడుతుంటారు. అయితే, ఇందుకు అదృష్టం కూడా ఉండాలని కొందరు భావిస్తుంటారు. అలాగే, మనిషి అభివృద్ధికి వాస్తు కూడా ప్రభావం చూపుతుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. వాస్తు పరంగా ఉంటున్న ఇల్లు ఎలా ఉండాలి. ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి..? ఎలాంటి నియమాలు పాటించాలని అనేది తప్పనిసరిగా చూస్తుంటారు. అలాగే, మరికొందరు ఇంట్లో చెట్లు, మొక్కలు కూడా వాస్తు పరంగానే పెంచుతుంటారు. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచటం వల్ల వాటి ఫలితాలు సానుకూలంగా, ప్రతికూలంగానూ ఉంటాయని భావిస్తారు. అలాంటిదే బొప్పాయి కూడా ఒకటి.. వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని చెబుతుంటారు.
వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు. ఇంటి ముందు, ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు. మీరు కూడా మొక్కలు, చెట్లను పెంచుతున్నట్టయితే, మీ ఇంటి పరిసరాలను ఓ సారి పరిశీలించండి.. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..