పట్టులాంటి మెరిసే జుట్టు కోసం చింతపండు రెమిడీ..! ఇలా చేస్తే.. వద్దంటే ఒత్తైన కురులు మీ సొంతం..!!
నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మంది అనేక తీవ్రమైన జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం, బట్టతల వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక ఇంటి చిట్కాలు ట్రై చేస్తుంటారు. కానీ జుట్టు సంరక్షణలో చింతపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వేసవిలో జుట్టు రాలడం, పొడిబారడం, వెంట్రుకలు చిట్లిపోవటం వంటి సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 12, 2025 | 8:35 AM

చింతపండు విటమిన్ సి అద్భుతమైన వనరు. అలాగే, యాంటీఆక్సిడెంట్ మూలకాలతో సమృద్ధిగా ఉండే చింతపండు జుట్టుకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. వేసవిలో చింతపండు నీటిని అనేక విధాలుగా ఉపయోగించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.

చింతపండులో ఉండే విటమిన్ సి చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీని కోసం, కొంచెం చింతపండును నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం బాగా గుజ్జు చేసి ఈ నీటిని మీ జుట్టు, తలకు రాయండి. అరగంట తర్వాత మీ జుట్టును శుభ్రమైన నీటితో వాష్ చేసుకోండి. ఈ రెమెడీని కొన్ని రోజులు నిరంతరం ప్రయత్నించడం ద్వారా చుండ్రు సమస్య తొలగిపోతుంది.

జుట్టు మృదువుగా ఉంచడానికి కూడా చింతపండు బెస్ట్ రెమిడీగా పనిచేస్తుంది. ఇందుకోసం కాస్త చింతపండు తీసుకుని నీళ్లలో నానబెట్టి చిక్కటి రసం పిండుకోవాలి. దీన్ని అలోవెరా జెల్ తో కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఇది మంచి హెయిర్ మాస్క్‌గా పనిచేస్తుంది. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూ వేసి జుట్టును కడగాలి. ఈ పద్ధతి వేసవిలో మీ జుట్టును హైడ్రేటెడ్ గా, మృదువుగా, మెరిసేలా ఉంచడానికి ఒక ప్రభావవంతమైన మార్గం.

చింతపండు నీరు జుట్టు పెరుగుదలకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. చింతపండు నీటితో జుట్టును క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చింతపండు నీరు తక్షణమే పరిష్కరిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టును మూలాల నుండి బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అదేవిధంగా, మీరు దానితో హెన్నా కలిపి అప్లై చేస్తే, మీ జుట్టు నల్లగా ఉంటుంది.





























