ఎనర్జిటిక్ స్టార్‌తో ఎఫ్ 2 దర్శకుడు.. ఇక ప్రేక్షకులకు మరింత ఫన్.. సినిమా ఎప్పుడో తెలుసా..
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అనిల్‌కి మంచి గుర్తింపు లభించింది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అనిల్‌కి మంచి గుర్తింపు లభించింది. దీంతో వరుస ప్రాజెక్ట్‌లు టేకాఫ్ చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. అయితే ఇప్పడు ఎనర్జ్‌టిక్ హీరో రామ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పటి నుంచో సినిమా వస్తుందని పుకార్లు వెలువడ్డాయి. దీంతో వాటికి పుల్‌స్టాప్ పెట్టి సినిమా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అనిల్ రైటర్ గా ఉన్నప్పటి నుంచి రామ్‌తో మంచి అనుబంధం ఉంది. వచ్చే ఏడాది చివర్లో రామ్, అనిల్ రావిపూడి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కూడా అనిల్ సినిమాల శైలిలోనే ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్ అనిల్ కావడంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నారు. కాగా ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు.
త్వరలో అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. విడుదల డేట్‌ను ప్రకటించిన చిత్రయూనిట్..