Peddi Movie: ‘పెద్ది’ సినిమా ఆరు రోజుల కలెక్షన్ల వివరాలివే.. ఆ రికార్డుకు అతి చేరువలో రామ్ చరణ్ సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరింది. మరికొన్ని రోజుల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పెద్ది వసూళ్లు మరింతగా పెరగవచ్చు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ ఈ మెగా మూవీ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలో పెద్ది ఆరో రోజుల కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం రూ. 332.1 కోట్లు సాధించినట్లు నిర్మాతలు వెల్లడించారు. అంటే మంగళవారం (జూన్ 10) ఈ మూవీకి రూ. 17.1 కోట్లకు పైగా వసళ్లు వచ్చాయి. ఈ మేరకు పెద్ది చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా కలెక్షన్ల పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక హిందీలోనూ పెద్దికి మంచిగానే వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటివరకు రూ.9.65 కోట్లు వచ్చినట్లు సాక్నిక్ పేర్కొంది. అటు ఓవర్సీస్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమాకు 3 మిలియన్ల డాలర్స్ కు పైగా వసూళ్లు వచ్చాయి. మొత్తానికి రేపటితో ఈ సినిమా రూ. 350 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ క్రికెటర్, రెజ్లర్, బ్లేడ్ రన్నర్ పాత్రల్లో అదరగొట్టాడు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గౌర్నాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు. జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు.
ఆరు రోజుల్లో రూ. 332.1 కోట్లు..
#Peddi collects a gross of over 332.1 CRORES WORLDWIDE in 6 days ❤🔥
BOX OFFICE CHAMPION reigning at the top 💥💥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/24pqa47vNG
— PEDDI (@PeddiMovieOffl) June 10, 2026
ఓవర్సీస్ లోనూ..
#PEDDI Mania continues at the Box Office 🔥
North America Gross $3M+ and counting 💥
AMC A-LIST and REGAL UNLIMITED Enabled Now ⚡#BlockbusterPEDDI in cinemas now, North America By @PrathyangiraUS@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/uE8zRtEZg8
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




