AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharathiraja: భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ సూపర్ స్టార్‌ను పదే పదే విమర్శించారు

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా (84) ఇవాళ (జూన్ 10) తెల్లవారుజామాను కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కళామతల్లికి ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

Bharathiraja: భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ సూపర్ స్టార్‌ను పదే పదే విమర్శించారు
Bharathiraja, Rajinikanth
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 12:18 PM

Share

భారతీరాజా లెజెండరీ డైరెక్టర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ వైపు ప్రేమకథా చిత్రాలు తీస్తూనే మరోవైపు ఎర్రగులాబీలు, టిక్ టిక్ టిక్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అప్పట్లోనే తెరకెక్కించారాయన. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన భారతీరాజా ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అందులో ప్రధానంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో  ఈ డైరెక్టర్ కు ఉన్న రైవల్రీ గురించి. భారతీరాజా దర్శకత్వంలో రజనీకాంత్ 16 వయతినిలే (తెలుగులో పదహారేళ్ల వయసు), కోడి పరాకుత్తు అనే రెండు సినిమాల్లో నటించారు. అయితే భారతీరాజా బహిరంగంగానే పలుమార్లు రజనీపై తీవ్ర విమర్శలు చేశారు. రజనీ తమిళుడు కాదంటూ అతను కర్ణాటక వ్యక్తి అంటూ పలు సందర్భాల్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారీ లెజెండరీ డైరెక్టర్.

తమిళనాడు – కర్ణాటక కావేరి జలాల వివాదం సమయంలో తమిళ హీరోలు దీక్ష చేశారు. అయితే ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి పోలీసులుపై దాడులు జరిగేదాక వెళ్లాయి. అయితే పోలీసులపై దాడిని రజనీ ఖండించారు. దీంతో భారతీరాజా రజనీని తీవ్రంగా విమర్శించారు. ‘రజనీ కర్ణాటక వాడు. అందుకే తమిళనాడు జలాల కోసం పోరాడట్లేదు. తమిళులపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నావు’ అంటూ బహిరంగంగానే సూపర్ స్టార్ పై కామెంట్స్ చేశారు. ఇక కొన్నేళ్లక్రితం రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించగానే భారతీరాజా మళ్లీ ఫైరయ్యారు. రజనీ పార్టీ పెట్టొచ్చు కానీ ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వకూడదు. తమిళ రాష్ట్రాన్ని తమిళులే పరిపాలించాలి అంటూ సూపర్ స్టార్ ను వ్యతిరేకించారీ లెజెండరీ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

భారతీరాజాకు తమిళ సంస్కృతి పట్ల, తమిళుల గుర్తింపు పట్ల తనదైన శైలిలో గట్టిగా గొంతు వినిపించారు. ఈక్రమంలోనే తమిళులకు మద్దతుగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారి తీశాయి. అందులో భాగంగానే రజనీని విమర్శించారు తప్పితే వ్యక్తిగతంగా వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.

భారతీరాజాకు మెగాస్టార్ చిరంజీవి నివాళి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం
రాగిని దైవ లోహంగా ఎందుకు భావిస్తారు.. అసలు కాపర్‌లో అంత ఏముంది?
రాగిని దైవ లోహంగా ఎందుకు భావిస్తారు.. అసలు కాపర్‌లో అంత ఏముంది?
కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..
కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..
1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?
1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..