బీటౌన్‏లో బిజీగా మారిన రకుల్.. చేతిలో రెండు సినిమాలు.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..

ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక అటు బీటౌన్‏లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటుంది.

బీటౌన్‏లో బిజీగా మారిన రకుల్.. చేతిలో రెండు సినిమాలు.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..
తమిళ్‌లో ఇండియన్‌2 సినిమా చేస్తుంది రకుల్.ఇప్పుడు ఈ సినిమా అటకెక్కితే ఎక్కింది..ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యేలా లేదు. అలాగే అయలాన్‌ అనే మరో మూవీలో నటిస్తుంది. 
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2021 | 7:23 PM

Actress Rakul Preet Singh: ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక అటు బీటౌన్‏లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఇప్పటికే హిందీలో యూరియన్, అయ్యారే, దేదే ప్యార్ దే వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పేసింది రకుల్.

తాజాగా రకుల్ బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా నటించనున్నారు. ఫుల్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి ‘డాక్టర్ జీ’ అనే టైటిల్‏ను ఖరారు చేసింది చిత్రయూనిట్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ ఉదయ్ పాత్రలో కనిపించనుండగా.. ఆయనకు సీనియర్ డాక్టర్‏ ఫాతిమా పాత్రలో రకుల్ నటించనుంది. ఇక ఈ సినిమాకు అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి రకుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సినిమాలో భాగమవుతున్నందుకు చాలా ఉత్సహంగా ఉందని తెలిపారు. మూవీ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాని ట్విట్ చేసింది రకుల్.

Also Read:

మరీ ఇంతా ఫన్నీగా తీస్తారా… ఈ సీరియల్‏లోని సన్నివేశాలు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..