మరీ ఇంతా ఫన్నీగా తీస్తారా… ఈ సీరియల్‏లోని సన్నివేశాలు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..

సాధరణంగా సీరియల్స్ ఎక్కడ మొదలయ్యి.. ఎక్కడా ముగుస్తాయో తెలియదు. ఇక ఈ ఏడాది సీరియల్ ప్రారంభమైందంటే.. అది ఎన్ని సంవత్సరాలు ముగింపు లేకుండా కొనసాగుతుందో కూడా

మరీ ఇంతా ఫన్నీగా తీస్తారా... ఈ సీరియల్‏లోని సన్నివేశాలు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2021 | 6:59 PM

సాధరణంగా సీరియల్స్ ఎక్కడ మొదలయ్యి.. ఎక్కడా ముగుస్తాయో తెలియదు. ఇక ఈ ఏడాది సీరియల్ ప్రారంభమైందంటే.. అది ఎన్ని సంవత్సరాలు ముగింపు లేకుండా కొనసాగుతుందో కూడా అర్ధం కాదు. ఇక అందులోనే పాత్రలు కూడా చిత్రవిచిత్రంగా ఉంటాయి. అవసరం లేని సీన్లు, వికారం కలిగించే ఎమోషనల్ పాత్రలతో కుప్పలకొద్ది సీరియల్లు ప్రసారమవుతుంటాయి. ఇక అందులో ప్రేక్షకులను హత్తుకునే సీరియల్లు దాదాపు తక్కువే. ఎప్పుడూ సీరియల్ హీరోయిన్ ఏడవడం… ఆమెను కష్టాలు పెట్టెందుకు విలన్స్ వేసే ప్లాన్స్ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ కొన్ని సార్లు సీరియల్లో తీసే సన్నివేశాలు కూడా భలే కామెడిగా ఉంటాయి. తాజాగా ఓ హిందీ సీరియ‏ల్లో కూడా ఇలాంటి సన్నివేశాలే ఉన్నాయి.

కలర్స్ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్లోని కొన్ని సన్నివేశాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలో అమ్మమ్మగా ఉన్న మహిళ చాలా కోపంగా గదిలోంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఆమెను వెళ్ళోద్దని ఆమె మనుమరాలు క్షమాపణలు చెబుతూ.. అమ్మమ్మ సాలువా పట్టుకుని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అదే సమయంలో ఆమె సాలువ జారడంతో.. మనుమరాలు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. దీంతో అమ్మమ్మ చేతిలో ఉన్న సాలువ మనుమరాలు మెడకు చుట్టుకుంటుంది. ఆ విషయాన్ని గ్రహించని ఆ పెద్దావిడ దానిని లాగుతూనే ఉంటుంది. చివరకు ఆ సాలువ మెడకు బిగుసుకొని మనుమరాలు చనిపోతుంది.

ఈ వీడియోను No Context Violence అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత కామెడిగా సీరియల్ తీస్తారా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ మీరు కూడా ఆ వీడియోను చూసేసి.. ఫుల్లుగా నవ్వేయ్యండి.