Bollywood: నేడు ఒక్కటి కానున్న బాలీవుడ్ ప్రేమ పక్షులు.. వైరలవుతోన్న రాజ్‌కుమార్ రొమాంటిక్ ప్రపోజల్..
ఏడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న బాలీవుడ్ ప్రేమ పక్షులు రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ నేడు (నవంబర్15) ఏడడుగులు నడవనున్నారు

ఏడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న బాలీవుడ్ ప్రేమ పక్షులు రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ నేడు (నవంబర్15) ఏడడుగులు నడవనున్నారు. చండీగఢ్‌లోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో వీరి వివాహ వేడుక జరగనుందంటూ బాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు. అందుకు తగ్గట్లే వీరి వివాహ శుభలేఖ, ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా నవంబర్ 13న జరిగిన నిశ్చితార్థం వేడుకలో రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ ఉంగరాలు మార్చుకున్నారు. కానీ ఎవరూ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
రింగ్ తొడిగి రొమాంటిక్ ప్రపోజల్.. 2014లో విడుదలైన ‘సిటీ లైట్స్’ చిత్రంలో జంటగా నటించారు రాజ్ కుమార్, పత్రలేఖ. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ‘బోస్: డెడ్ /అలైవ్ చిత్రంలో స్ర్కీన్ షేర్ చేసుకుని మరోసారి అభిమానులను మురిపించారు. ఇలా ఏడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతోన్న ఈ ప్రేమ పక్షులు నవంబర్ 13న చండీగఢ్‌లోని సుఖ్ విలాస్ రిసార్ట్‌లో వేడుకగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈవేడుకుకు ఫరాఖాన్, హ్యుమా ఖురేషీ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. నిశ్చితార్థం వేడుకల్లో భాగంగా రాజ్‌కుమార్, పత్రలేఖ ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మోకాళ్ల మీద కూర్చొని పత్రలేఖకు రింగ్ తొడిగి రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
View this post on Instagram
Everyone is invited in this beautiful wedding ceremony ?❤️(virtually?) of #RajkummarRao #Patralekhaa pic.twitter.com/rXGnNhRWbn
— Rajkumar Rao(Rini) (@Rajkummar_vibes) November 14, 2021
Also Read:
Junior Nagarjuna: నవ మన్మథుడు కింగ్ నాగార్జునలా .. జూనియర్ నాగ్.. వీడియో వైరల్..
Yesudas: ఆయనది అయిదు పుష్కరాల స్వరం.. అయినా తరగని మాధుర్యం.. జేసుదాసు తొలి పాటకు ఆరవై ఏళ్లు