AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipli Ganjgh: ‘ఏ ఊకో కాక’ మెన్స్‌వేర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్.. షాప్ టైటిల్ చూసి షాకవుతున్న జనాలు..

Rahul Sipli Ganjgh: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లి గంజ్ బిజినెస్ ప్రారంభించాడు. తెలంగాణ వ్యాప్తంగా మెన్స్‌వేర్ షోరూమ్స్

Rahul Sipli Ganjgh: 'ఏ ఊకో కాక' మెన్స్‌వేర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్.. షాప్ టైటిల్ చూసి షాకవుతున్న జనాలు..
uppula Raju
|

Updated on: Jan 11, 2021 | 8:30 AM

Share

Rahul Sipli Ganjgh: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లి గంజ్ బిజినెస్ ప్రారంభించాడు. తెలంగాణ వ్యాప్తంగా మెన్స్‌వేర్ షోరూమ్స్ ప్రారంభిస్తున్నాడు. అయితే ఏది చేసినా వెరైటీగా చేసే సిప్లి గంజ్ ఈ షాప్‌ల పేరును విభిన్నంగా పెట్టాడు. దీంతో అందరు షాప్ పేరు చూసి షాకవుతున్నారు. నలుగురు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ల మాటలకు విసిగెత్తిన వారు ‘ఏ ఊకో కాక మస్తు చెప్తున్నవ్’ అని గేలి చేస్తుంటారు. అయితే ఈ పదమే ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందంటే నమ్ముతారా?

ఊకో కాక పేరిట ఏకంగా షాపులు కూడా ఓపెన్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజమే. ఇప్పుడు ఆ పదాన్నే తన వ్యాపారానికి పెట్టుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. దీనిని సెలెక్ట్ చేయడమే కాకుండా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరో ఆరు షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జనరల్ గా బ్రాండ్ పేరు పెట్టడానికి చాలా మంది వ్యాపారులు ఇంటర్నేషనల్ లెవల్లో ఆలోచించి సెలెక్ట్ చేస్తారు. అయితే రాహుల్ సిప్లి గంజ్ మాత్రం తెలంగాణ జనం నోళ్లలో ఎక్కవగా వాడుకలో ఉండే పదాన్ని ఎంచుకోవడం విశేషం. దీంతో కస్టమర్లను ‘ఏ ఊకో కాక’ షోరూమ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. విభిన్నంగా ఆలోచించి పేరు పెట్టిన సింప్లిగంజ్‌ను పలువురు అభినందిస్తున్నారు.