మలయాళం వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ రిమేక్ సినిమాలో హీరోయిన్‏గా రాశిఖన్నా..

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళంలో కూడా వరుస

  • Rajitha Chanti
  • Publish Date - 10:45 am, Mon, 25 January 21
మలయాళం వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ రిమేక్ సినిమాలో హీరోయిన్‏గా రాశిఖన్నా..

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళంలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగుతోంది రాశీఖన్నా. తాజాగా మలయాళం ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అందాదున్’. ఇందులో ఇస్మార్ట్ భామ నభా నటేష్, మిల్కిబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే నితిన్ నటించిన చెక్, రంగ్ దే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక త్వరలోనే అందాదున్ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉండగా.. అందాదున్ సినిమాను మలయాళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కతుండగా.. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశిఖన్నా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్‏లో త్వరలో జాయిన్ కాబోతుందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీతో రాశిఖన్నా మలయాళంలో కూడా తన లక్‏ను పరిక్షించుకునేందుకు రెడీ అవుతుంది.

Also Read:

Akshara Movie: థియేటర్లలోకి రాబోతున్న నందిత శ్వేత ‘అక్షర’.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..