AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 3: పుష్ప 3‌పై క్రేజీ అప్‌డేట్.. మొదలయ్యేది అప్పుడే

పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్‌లో ఆడియన్స్‌కు సుకుమార్ వదిలేసారా..? అసలు పుష్ప 2లో ఏం చూపించారు..? పార్ట్ 3 కోసం ఏమేం దాచేసారు..? రైజ్, రూల్ తర్వాత.. ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? పదండి ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

Pushpa 3: పుష్ప 3‌పై క్రేజీ అప్‌డేట్.. మొదలయ్యేది అప్పుడే
Pushpa 2
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajitha Chanti|

Updated on: Dec 07, 2024 | 9:34 PM

Share

పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్‌లో ఆడియన్స్‌కు సుకుమార్ వదిలేసారా..? అసలు పుష్ప 2లో ఏం చూపించారు..? పార్ట్ 3 కోసం ఏమేం దాచేసారు..? రైజ్, రూల్ తర్వాత.. ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..? పదండి ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్ప రాజ్. ఇంటా బయటా అని తేడాలేదు.. అన్ని చోట్లా మోత మోగిస్తుంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు.. నార్త్‌లోనూ తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపిస్తున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.. కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపే 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్.

ట్రైలర్‌లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్‌లో కొందరితో బిజినెస్ డీల్స్ చేస్తాడు పుష్ప.. అలాగే అక్కడ మరికొన్ని సీన్స్ కూడా ఉంటాయి. అవేవీ పార్ట్ 2లో కనిపించలేదు. దాంతో పాటు పుష్పపై జాలిరెడ్డి గన్ ఎక్కుపెట్టిన సీన్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు.. జపాన్ ఎపిసోడ్ సైతం సడన్‌గా కట్ చేసారు సుక్కు. రెండేళ్ళ కింద రిలీజ్ చేసిన Where Is Pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్‌లో లేదు. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు లెక్కల మాస్టారు. వీటన్నింటికీ ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్ట్స్ రామ్ చరణ్‌తో సినిమా కమిటైన సుక్కు.. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.