రాహుల్ ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న పున్నూ..!

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య జరిగిన కెమిస్ట్రీని బుల్లితెర ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అంతేకాదు ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు మంచి ర్యాపోను మెయిన్‌టెన్ చేస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఈ ఇద్దరు ఖండిస్తున్నా.. ఆ రూమర్లకు మాత్రం ఇంతవరకు చెక్ పడలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం […]

రాహుల్ ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న పున్నూ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 10, 2020 | 8:30 PM

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య జరిగిన కెమిస్ట్రీని బుల్లితెర ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అంతేకాదు ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు మంచి ర్యాపోను మెయిన్‌టెన్ చేస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఈ ఇద్దరు ఖండిస్తున్నా.. ఆ రూమర్లకు మాత్రం ఇంతవరకు చెక్ పడలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రాహుల్ ఫ్యాన్స్‌కు పునర్నవి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. త్వరలో పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో గత కొన్ని రోజులుగా రిలేషన్‌లో ఉన్న పున్నూ.. అతడిని వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్‌తో ప్రేమ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా బిగ్‌బాస్‌ తరువాత పునర్నవి సినిమాల్లోనూ దూసుకుపోతోంది. సైకిల్, ఒక చిన్న విరామం సినిమాల్లో ఆమె నటించగా.. ఒక చిన్న విరామం విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరో రెండు చిత్రాల్లో పునర్నవి కనిపించబోతున్నట్లు సమాచారం.