ప్రజంటింగ్ యూ అరివీర భయంకర “అరణ్య”
రానా దగ్గుబాటి..భారత చలనచిత్ర సీమలో ప్రత్యేకత ఉన్న నటుడు. ఒక స్టార్‌గా కాకుండా నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..తన మార్క్ వేస్తున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. బాషా బేధాలు ఉండవు..పాత్ర నిడివితో అస్సలు సంబంధం ఉండదు..నటించడానికి స్కోప్ ఉంటే చాలు పరకాయ ప్రవేశం చేస్తాడు రానా. అందుకే..తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సినిమాలతో అదరగొడుతున్నాడు. ‘బాహుబలి’ సిరీస్‌తో రానా రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ సినిమా […]
రానా దగ్గుబాటి..భారత చలనచిత్ర సీమలో ప్రత్యేకత ఉన్న నటుడు. ఒక స్టార్‌గా కాకుండా నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..తన మార్క్ వేస్తున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. బాషా బేధాలు ఉండవు..పాత్ర నిడివితో అస్సలు సంబంధం ఉండదు..నటించడానికి స్కోప్ ఉంటే చాలు పరకాయ ప్రవేశం చేస్తాడు రానా. అందుకే..తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సినిమాలతో అదరగొడుతున్నాడు. ‘బాహుబలి’ సిరీస్‌తో రానా రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ సినిమా చేస్తున్నాడు ఈ కండల వీరుడు. మరోవైపు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ‘హాథీ మేరే సాథీ’ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీని తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదల చేస్తోన్నారు. ఈ రోజు(సోమవారం) రానా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ చేశారు. ఇందులో అరివీర భయకరమైన లుక్‌తో మెస్మరైజ్ చేశాడు రానా. మనుసుల స్వార్థం కోసం అడవులను నాశనం చేయడం, సహజ వనరులను దుర్వినియోగం చేయడం వల్ల మూగ జీవులు, వన్యప్రాణులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయనే కథాశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. మానవులు విపరీత చర్యల వల్ల ఏనుగులు అంతరించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, వాటి కోసం నిలబడి..అన్యాయాలను ధైర్యంగా ఎదరించిన ఓ వ్యక్తి కథే ఈ ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్, శ్రియ పిలగోన్కర్, జోయా హుస్సేన్ మరికొన్ని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Back with a release nationally after 3 years!! Sorry for the delay but I promise you it’s worth the wait…..Witness the biggest fight to #SaveTheForest? in #Aranya (Telugu) #Kaadan (Tamil) #HaathiMereSaathi (Hindi) on April 2, 2020 at a theatre near you. pic.twitter.com/LokSBshloX
— Rana Daggubati (@RanaDaggubati) February 10, 2020