‘విక్రమ్ వేద’ రీమేక్.. రంగంలోకి మెగా పవర్ స్టార్..?
Vikram Vedha Telugu Remake: విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో హిట్ అయిన ‘విక్రమ్ వేద’ సినిమాను ఎప్పటినుంచో తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరోలు సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ రీమేక్ చిత్రం గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత అల్లు అరవింద్ […]
Vikram Vedha Telugu Remake: విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో హిట్ అయిన ‘విక్రమ్ వేద’ సినిమాను ఎప్పటినుంచో తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరోలు సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ రీమేక్ చిత్రం గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత అల్లు అరవింద్ మాధవన్ పాత్రలో రామ్ చరణ్‌ను నటింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ.. ఇది పూర్తి కాగానే చిరు, కొరటాల మూవీలో ఓ కీ రోల్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత సుకుమార్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ ముగిసేసరికి 2021 ఆఖరు కావచ్చు. అయితే అరవింద్‌కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వచ్చే ఏడాది మధ్యలో ‘విక్రమ్ వేద’ రీమేక్ సెట్స్‌పైకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.