ఆ క్రికెటర్ తీరుతో ఇబ్బంది పడ్డా: ప్రియమణి

ఆ క్రికెటర్ తీరుతో ఇబ్బంది పడ్డా: ప్రియమణి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఓ క్రికెటర్‌ను నటి ప్రియమణి చెంపదెబ్బ కొట్టిందంటూ ఆ మధ్యన వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్న ఈ టోర్నీలో దక్షిణాది తారకు అవమానం జరిగిందన్న కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. వాటిపై తాజాగా ఈ నటి వివరణ ఇచ్చింది. “అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఓ వ్యక్తి  నా ఫోన్ దొంగలించి నాతో ప్రాంక్‌ చేశాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తరువాత నా హోటల్‌ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 09, 2020 | 11:31 AM

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఓ క్రికెటర్‌ను నటి ప్రియమణి చెంపదెబ్బ కొట్టిందంటూ ఆ మధ్యన వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్న ఈ టోర్నీలో దక్షిణాది తారకు అవమానం జరిగిందన్న కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. వాటిపై తాజాగా ఈ నటి వివరణ ఇచ్చింది.

“అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఓ వ్యక్తి  నా ఫోన్ దొంగలించి నాతో ప్రాంక్‌ చేశాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తరువాత నా హోటల్‌ రూమ్‌కు వచ్చాడు.  ఆ సమయంలో నాతో అతడు ప్రవర్తించిన విధానం సరిగా లేదని మాత్రమే అతడికి చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవమే. కానీ నేను అతడిని కొట్టానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అని ప్రియమణి క్లారిటీ ఇచ్చేసింది. అయితే అతడి పేరును మాత్రం ఆమె బయటకు చెప్పలేదు. కాగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోన్న ప్రియమణి.. ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప’, రానా ‘విరాటపర్వం’ తో పాటు హిందీలో అజయ్‌ దేవగన్ సరసన మైదాన్‌లో నటిస్తోంది. అలాగే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Read This Story Also: అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu