అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా..!

అఖిల్ అక్కినేని బుధవారం నాడు 26వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:40 am, Thu, 9 April 20
అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా..!

అఖిల్ అక్కినేని బుధవారం నాడు 26వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అఖిల్‌కు మంచి భవిష్యత్ ఉండాలని భావిస్తున్నామని వారు తమ అభినందనలు వెల్లడించారు. కానీ చైతన్య, సమంత మాత్రం ఈసారి అఖిల్‌కు సోషల్ మీడియాలో విషెస్‌ చెప్పలేదు. ప్రతి ఏడాది తమ సోషల్ మీడియాలో అఖిల్‌కు విష్‌ చేస్తూ వస్తోన్న ఈ ఇద్దరు ఈసారి చెప్పకపోవడంపై ఫ్యాన్స్‌ ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరికొందరేమో సోషల్ మీడియాలో చెప్పకపోయినప్పటికీ.. ఫోన్ చేసి చెప్పి ఉండచ్చు కదా అన్న కామెంట్లు పెడుతున్నారు. మరి అఖిల్‌కు వారు విషెస్‌ చెప్పారా..? అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో చై-సమంత ఒక చోట ఉండగా.. అఖిల్, నాగార్జున, అమల మరో చోట ఉన్నారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే సాదాసీదాగా పుట్టినరోజును జరుపుకున్నారు అఖిల్.

Read This Story Also: చిరంజీవి పాటలపై మెగా హీరో సంచలన నిర్ణయం..!