చిరంజీవి పాటలపై మెగా హీరో సంచలన నిర్ణయం..!

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నడుస్తోన్న మెగా హీరోలు.. పలు సినిమాల్లో ఆయన రెఫరెన్స్‌ను వాడుకుంటూ ఉంటారు. చిరు ఫొటో, డైలాగ్‌, పాట.. ఇలా ఏదో ఒకటి తమ సినిమాల్లో పెట్టుకుంటూ వస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మొదలు.. ఇప్పుడు రాబోతోన్న వైష్ణవ్ తేజ్‌ కూడా తమ సినిమాల్లో చిరు రెఫరెన్స్‌ను వాడుకున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. చిరంజీవి పాటలపై మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇకపై చిరు పాటలను రీమిక్స్‌ […]

  • Publish Date - 8:34 am, Thu, 9 April 20 Edited By:
చిరంజీవి పాటలపై మెగా హీరో సంచలన నిర్ణయం..!

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నడుస్తోన్న మెగా హీరోలు.. పలు సినిమాల్లో ఆయన రెఫరెన్స్‌ను వాడుకుంటూ ఉంటారు. చిరు ఫొటో, డైలాగ్‌, పాట.. ఇలా ఏదో ఒకటి తమ సినిమాల్లో పెట్టుకుంటూ వస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మొదలు.. ఇప్పుడు రాబోతోన్న వైష్ణవ్ తేజ్‌ కూడా తమ సినిమాల్లో చిరు రెఫరెన్స్‌ను వాడుకున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. చిరంజీవి పాటలపై మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

ఇకపై చిరు పాటలను రీమిక్స్‌ చేయకూడదని ఈ యంగ్ హీరో నిర్ణయం తీసుకున్నారట. కారణాలు తెలీదు గానీ.. చిరు పాటలను రీమిక్స్ చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికి ఈ హీరో వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు మెగాస్టార్‌కు సంబంధించిన నాలుగు పాటల రీమిక్స్‌లో సాయి నటించారు. ‘రేయ్‌’లో ‘గోలీమార్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌’లో ‘గువ్వ గోరింకతో’, ‘సుప్రీం’లో ‘అందం హిందోళం’.. ‘ఇంటిలిజెంట్‌’లో ‘చమక్‌ చమక్‌ చాం’ పాటల రీమిక్స్‌లో తేజ్ నటించారు. వాటిలో ‘గువ్వ గోరింకతో’, ‘అందం హిందోళం’ విజువల్స్‌ పరంగా బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. మిగిలిన రెండు పెద్దగా హిట్ అవ్వలేదు. అంతేకాదు చిరంజీవి పాటలను ఖూనీ చేస్తున్నాడంటూ సాయి తేజ్‌పై మెగా ఫ్యాన్స్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తేజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ హీరో నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ను మే 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. మరోవైపు లాక్‌డౌన్ తరువాత దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌లో సాయి నటించబోతున్నారు.

Read This Story Also: Coronavirus: మాట నిలుపుకున్న సల్మాన్.. వారికి మొదటి విడత సాయం!