ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా.. క్లైమాక్స్ మార్పు

కన్నుగీటి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా వచ్చిన చిత్రం ‘ఒరు అడార్ లవ్’. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియా వారియర్ ద్వారా సినిమాకి మంచి పాపులారిటీ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. దీనితో రంగంలోకి దిగిన చిత్ర […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:09 pm, Tue, 19 February 19
ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా.. క్లైమాక్స్ మార్పు

కన్నుగీటి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా వచ్చిన చిత్రం ‘ఒరు అడార్ లవ్’. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియా వారియర్ ద్వారా సినిమాకి మంచి పాపులారిటీ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. దీనితో రంగంలోకి దిగిన చిత్ర బృందం క్లైమాక్స్ మార్చాలని నిర్ణయించారు.    

దర్శకుడు ఒమర్ లులు మాట్లాడుతూ ‘క్లైమాక్స్ సీన్స్ మళ్ళీ మార్పులు చేసి చిత్రీకరించాం. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్ తో చిత్రం ప్రదర్శించబడుతుందని’ అని అన్నారు. నా మనసుకు నచ్చిన కథ ఇది. అందుకే రియలిస్టిక్ గా తెరకెక్కించాలని సినిమా క్లైమాక్స్ ట్రాజెడీ తో ఎండ్ చేశాం. కానీ ఆ సన్నివేశం అందరిని నిరాశ పరిచింది. దీనితో క్లైమాక్స్ మొత్తం మార్చి తెరకెక్కించాం’ అని వెల్లడించారు.