Nayanthara: కాబోయే భర్త నయన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా? అదే లేడీ సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్

Janardhan Veluru

Janardhan Veluru |

Updated on: Sep 02, 2021 | 11:35 AM

లేడీ సూపర్‌స్టార్ నయనతార తమిళ్, తెలుగు ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. తన మాతృభాష మలయాళ సినీ ఇండస్ట్రీపై మాత్రం ఆసక్తిని వదులుకోరు.

Nayanthara: కాబోయే భర్త నయన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా? అదే లేడీ సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్
Vignesh Shivan And Nayanthara

Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార తమిళ్, తెలుగు ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. తన మాతృభాష మలయాళ సినీ ఇండస్ట్రీపై మాత్రం ఆసక్తిని వదులుకోరు. మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంటారు. తమిళ్, తెలుగు సినిమాలతో కోట్లాది రూపాయల రెన్యుమరేషన్ తీసుకుంటుంది నయన్. అయితే మలయాళ సినిమాల్లో మాత్రం చాలా తక్కువే (లక్షల్లోనే) పారితోషికం తీసుకుంటారట. మలయాళ సినిమాల్లో తన పాత్ర నచ్చితే చాలు.. పారితోషికం విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మలయాళ సినిమాలు చాలా వరకు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించడమే దీనికి కారణం. భారీ పారితోషికం ఆశిస్తూ తన సొంత రాష్ట్రంలోని ఫ్యాన్స్‌కు దూరం కాకూడదన్న ఆలోచనతోనే నయన్… ఇలా తక్కువ పారితోషికానికే మలయాళ సినిమాలు చేస్తుంటారని చెబుతారు.

తాజాగా నయనతార మరో మలయాళం చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘గోల్డ్‌’ (బంగారం) అనే టైటిల్‌ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్‌ హీరోగా నటించనున్నారు. ప్రేమమ్ తదితర హిట్స్ మూవీస్ అందించిన అల్ఫోన్స్‌ పుత్రెన్‌ దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ నెలలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఫస్ట్‌ షెడ్యూల్‌లోనే నయనతార ‘గోల్డ్‌’ సినిమా సెట్స్‌లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.

Nayanthara

Nayanthara

కాబోయే భర్త విఘ్నేష్ శివన్ నయనతారను ముద్దుగా ‘తంగమ్’ (బంగారం) అని పిలుస్తారట. అందుకే ఈ సినిమాకు గోల్డ్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార బంగారం లాంటి క్యారెక్టర్ పోషిస్తారట.

Also Read..

Bheemla Nayak: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..

Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu