తలైవాకు విలన్‌గా ప్రతీక్..!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘ దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభమైంది. ఇందులో రజనీ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేశారు. కాగా మురుగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది […]

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘ దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభమైంది. ఇందులో రజనీ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేశారు. కాగా మురుగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది మూడవ సారి. ఇంతకుముందు విద్యుత్ జమ్మవాల్‌ను తుపాకి లో విలన్‌గా.. నీల్ నితిన్ ముఖేష్‌ను కత్తి లో విలన్ గా నటింపజేశారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.