AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకీ మామతో చేతులు కలిపిన చైతూ..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. రీసెంట్ గా చిత్ర యూనిట్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ ఆధారంగా చూస్తే బోర్డర్ లో ఉండే సైనికులకు, పల్లెలో ఉండే వ్యక్తులకు లింకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుంటే.. వెంకటేష్ పల్లెటూరిలో మిల్లు ఓనర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం […]

వెంకీ మామతో చేతులు కలిపిన చైతూ..!
Ravi Kiran
|

Updated on: Apr 17, 2019 | 5:37 PM

Share

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. రీసెంట్ గా చిత్ర యూనిట్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ ఆధారంగా చూస్తే బోర్డర్ లో ఉండే సైనికులకు, పల్లెలో ఉండే వ్యక్తులకు లింకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుంటే.. వెంకటేష్ పల్లెటూరిలో మిల్లు ఓనర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం మెయిన్ పాయింట్ గురించి..ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సెలవులపై పల్లెటూరికి వచ్చిన నాగచైతన్య… వెంకటేష్ తో కలిసి రాజకీయ నాయకులను ఎదుర్కునే నేపధ్యమే ఈ మూవీ థీమ్ అట. చూడబోతే పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారట.