బంపర్ ఆఫర్ కొట్టేసిన వరుణ్ తేజ్ హీరోయిన్.. సల్మాన్‏తో జోడి కట్టనున్న అందాల భామ..

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ప్రగ్యాజైశ్వాల్. ఆ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం

బంపర్ ఆఫర్ కొట్టేసిన వరుణ్ తేజ్ హీరోయిన్.. సల్మాన్‏తో జోడి కట్టనున్న అందాల భామ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 30, 2021 | 7:11 AM

Actress pragya jaiswal: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ప్రగ్యాజైశ్వాల్. ఆ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఇప్పటివరకు సరైన బ్రేక్ దొరకలేదు. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‏గా నటించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా సమాచారం.

ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‏గా కెరీర్ స్టార్ చేసిన ప్రగ్యా.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆఫర్లు లేక ఇప్పటి వరకు సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‏లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘అంతిమ్’. ఇందులో సల్మాన్ ఖాన్ సిక్కు పోలీస్ ఆఫీసర్‏గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‏గా ప్రగ్యా జైశ్వాల్ నటించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?