కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ యంగ్ హీరో! కలనెరవేరిందిగా.. ఇంతకి ఏ సినిమాలో తెలుసా..
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో కత్రినాపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో కత్రినాపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని చాలా గొప్పగా వ్యక్తపరిచాడు. అయితే రియల్ లైఫ్‌లో అంత రొమాన్స్ కుదురుతుందో లేదో కానీ రీల్ లైఫ్‌లో మాత్రం కుదిరింది. కత్రినా పట్ల క్రష్ ఉన్న కార్తీక్ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై జతకట్టబోతున్నాడని సమాచారం. డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్‌లు అందుకుంటున్న కార్తీక్.. తాజాగా షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్’తో ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడని బీ టౌన్ టాక్.
‘ఫ్రెడ్డీ’గా టైటిల్ ఫైనల్ అయిన ఈ చిత్రంలో కత్రినాతో కలిసి రొమాన్స్ చేయనున్నాడు. దీనిపై ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా ప్రాజెక్ట్ మాత్రం త్వరలో పట్టాలెక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. కత్రినా షారుఖ్‌తో కలిసి 2018లో వచ్చిన ‘జీరో’ సినిమాలో కనిపించింది. ఇందులో తన పాత్రకు ప్రశంసలు దక్కగా..తన ప్రొడక్షన్ హౌజ్‌లో వచ్చే సినిమాలో కత్రినా చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట షారుఖ్. స్క్రిప్ట్ విన్న కత్రినా ఇప్పటికే ఎస్ చెప్పగా.. అఫీషియల్‌గా సైన్ చేయాల్సి ఉందని సమాచారం. అయితే మరి కార్తీక్ కల నెరవేరినట్లేగా.
అభిమానికి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన యాంకర్ సుమ.. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక..