మరోసారి చిరు వెర్సస్ బాలయ్య బాక్సాఫీస్ వార్.. నందమూరి హీరో మనసులోని ఆలోచన ఏంటి..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య టీజర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారట.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య టీజర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆచార్య టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ చేశారు మేకర్స్. ఆచార్య రిలీజ్ డేట్ వచ్చింది కాబట్టి బీబీ 3 రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయాలన్నది నందమూరి హీరో ప్లానట. అందుకే ఆచార్య రిలీజ్ డేట్ వచ్చిన నేపథ్యంలో కాస్త అటు ఇటుగా.. అంటే ఆచార్యకు పోటీగా బీబీ 3 రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసే ప్లాన్‌లో బాలకృష్ణ ఉన్నారన్నది ఇండస్ట్రీ టాక్.
చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చిరుతో ఢీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి అలాంటి టఫ్ ఫైట్ కోసం ఎదురుచూస్తున్నారట. అందుకే ఆచార్య టీజర్ వచ్చాకే బాలయ్య సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు బీబీ 3 మేకర్స్.
Also Read: