అంజనాదేవి పుట్టిన రోజును ఘనంగా జరిపిన మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్… సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు…
మెగా అభిమానులకు జనవరి 29, 2021మరిచిపోలేని రోజులా మారింది. ఒక సర్‌ప్రైజ్‌ను మించిన మరో సర్‌ప్రైజ్.. ఇలా నాలుగైదు కానుకలు మెగా...

మెగా అభిమానులకు జనవరి 29, 2021మరిచిపోలేని రోజులా మారింది. ఒక సర్‌ప్రైజ్‌ను మించిన మరో సర్‌ప్రైజ్.. ఇలా నాలుగైదు కానుకలు మెగా ఫ్యాన్స్‌ను ముంచెత్తాయి. ఆచార్య టీజర్, రిలీజ్ డేట్, మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు, చరణ్ వాయిస్ ఓవర్… ఫైనల్‌గా అమ్మ జన్మదిన వేడుకకు చిన్నోడు పవన్ కళ్యాణ్ హాజరు కావడం ఇలా ఫ్యాన్స్‌ను పండగ చేసుకునేలా చేసిన అంశాలు అనేకం జరిగాయి రోజు అందుకే సోషల్ మీడియాలో ఈ రోజంతా మెగా సందడే…
జన్మనిచ్చిన అమ్మ అంటూ చిరు ట్వీట్… వీడియో…
తనకు జన్మనిచ్చిన తల్లి అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ వీడియోను ట్విటర్ ద్వారా చిరంజీవి షేర్ చేశారు. నాగబాబు సైతం తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా… శుక్రవారం సాయంత్రం అంజనాదేవి పుట్టినరోజు వేడుకను మెగాబ్రదర్స్, సిస్టర్స్ అంతా ఒక్కచోట చేరి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంజనాదేవి మధ్యలో కూర్చోగా..చిరంజీవి, నాగబాబు దంపతులు, పవన్‌కల్యాణ్, సోదరీమణులు విజయదుర్గ, మాధవి రెండు వైపులా ఉన్నారు. ఈ ఫొటోను నాగబాబు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.