AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’‌.. ఇంట్రస్టింగ్ న్యూస్‌..!

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మూవీ రాధే శ్యామ్‌. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతోంది.

ప్రభాస్ 'రాధే శ్యామ్'‌.. ఇంట్రస్టింగ్ న్యూస్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 19, 2020 | 11:23 AM

Share

Prabhas Radhe Shyam: రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మూవీ రాధే శ్యామ్‌. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుండగా.. ప్రధాన పాత్రాధారులందరూ అందులో పాల్గొంటున్నారు. ఇక ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. ఆ రోజున మోషన్ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న రాధే శ్యామ్ గురించి ఇప్పుడొక ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ మూవీలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండవట. సినిమా ఆద్యంతం ఒక్కరి మీద కూడా ప్రభాస్ చేయి చేసుకోడట. ఇంకా చెప్పాలంటే క్లీన్ అండ్ క్లీన్ లవ్‌ స్టోరీగా రాధే శ్యామ్ ఉండబోతుందట. అంతేకాదు ఇప్పటివరకు కనిపించని విధంగా ఇందులో ప్రభాస్‌ని అభిమానులు చూడబోతున్నట్లు సమాచారం. మొత్తానికి సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు అందులోనే లీనమైపోయేలా దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని పలు భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

Read More:

భారీ ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

దివ్య కేసు: నిలకడగా నాగేంద్ర బాబు ఆరోగ్యం

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు