Prabhas: హిట్ కొట్టేందుకు ప్రభాస్ కొత్త ఫార్ములా.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Prabhas Movie Project K Update: ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనపై దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఒకేసారి 4 సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.
తెలియకుండానే తన అభిమానులకు ప్రభాస్ (Hero Prabhas) భారీగా బాకీ పడిపోయారు. బాహుబలి తర్వాత రెండు భారీ ఫ్లాపులను ఇచ్చారు. దాంతో ఎలాగైనా ఆ బాకీ తీర్చుకోవాలనే కసితో ఉన్నారు రెబల్ స్టార్. దానికోసం ఓ వైపు యాక్షన్‌తో పాటు మరోవైపు టెక్నాలజీని నమ్ముకుంటున్నారు. రాధే శ్యామ్ దెబ్బకు రొమాన్స్ అనే మాటకు దూరం అయిపోయారు ప్రభాస్. తాజాగా ఈయన సినిమాల కోసం హాలీవుడ్ టెక్నాలజీను వాడుకుంటున్నారు. మరి అవేంటి.. వాటి ప్రత్యేకత ఏంటి..?
ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనపై దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఒకేసారి 4 సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఒక్కో సినిమాకు యావరేజ్ బడ్జెట్ రూ.300 కోట్లకు పైగానే ఉంది. సాహోతో యాక్షన్ ట్రై చేసిన ప్రభాస్.. రాధే శ్యామ్‌లో లవ్ ట్రాక్ ఎక్కారు. కత్తి పట్టే ప్రభాస్.. పూలు పట్టుకుంటే చూడలేకపోయారు ఆడియన్స్. అందుకే నెక్ట్స్ అంతా యాక్షన్ ప్లస్ టెక్నాలజీ అంటున్నారు రెబల్ స్టార్.
సలార్‌లో సరికొత్త యాక్షన్ సీక్వెన్సులను ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం చేయనున్నారు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లోనే అదిరిపోయే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు ప్రశాంత్. ఇప్పుడు సలార్‌లో దాన్ని మరిపించేలా.. ప్రభాస్ ఇమేజ్ పదింతలు పెరిగేలా ఎలివేషన్స్‌కు తోడు యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు ఎమోషన్స్‌కు పెద్ద పీట వేస్తున్నారు ప్రశాంత్. కెజియఫ్‌లో ఎంత యాక్షన్ ఉన్నా.. డ్రామా దానికి మించి ఉంది. సలార్‌లోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K (Project K) కోసం ఆరీ అలెక్సా 65 అనే కెమెరాను వాడుతున్నారు. అవెంజర్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌ను ఈ కెమెరాతోనే చిత్రీకరించారు. రూ.8 కోట్లకు పైనే ఉండే ఈ కెమెరాకు హై ఎండ్ మోషన్ పిక్చర్స్‌కి క్యాప్చర్ చేసే సత్తా ఉంటుంది. కీలకమైన షాట్స్ కోసం ఈ ఆరీ అలెక్సా 65 వాడతారు. ఈ కెమెరా వాడుకుంటున్న తొలి ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ కేనే. మొత్తానికి ఫ్లాప్స్ ట్రాక్ నుంచి బయటపడ్డానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ప్రభాస్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..