AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘సినిమా, రాజకీయాలు వేరన్న దానిపై నాకు స్పష్టత ఉంది’… పవన్‌ కళ్యాణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Pawan Kalyan: నాని (Nani) హీరోగా తెరకెక్కిన 'అంటే సుందరానికీ' ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే పవన్‌...

Pawan Kalyan: 'సినిమా, రాజకీయాలు వేరన్న దానిపై నాకు స్పష్టత ఉంది'... పవన్‌ కళ్యాణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Narender Vaitla
|

Updated on: Jun 10, 2022 | 7:00 AM

Share

Pawan Kalyan: నాని (Nani) హీరోగా తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ స్పీచ్‌ ఈవెంట్‌కు హైలెట్‌గా మారింది. ముఖ్యంగా ఇండస్ట్రీని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఒక కుటుంబానిది కాదు.. ఇది మనందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం.. అది సహజం. అంతేకానీ ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. అయినప్పటికీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది’ అని చెప్పుకొచ్చారు పవన్‌.

ఇక హీరో నాని గురించి మాట్లాడిన పవన్‌.. నాని విలక్షణమైన నటుడని పొగడ్తల వర్షం కురిపించారు. నాని వ్యక్తిత్వం అంటే తనకు ఇష్టమని తెలిపిన పవన్‌. నానికి మరిన్ని హిట్‌ సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని అద్భుతంగా తీశాడని పవన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అంటే సుందరానికీ సినిమాను నిర్మించిన నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌గార్ల నిర్మాణంలో పవన్‌ హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమాలో నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

అంటే సుందరానికీ సినిమా విషయానికొస్తే ఫుల్‌ లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్‌ వచ్చింది. 2.56 గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో నానికి జోడిగా నజ్రియా నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో మరికాసేపట్లో తేలనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా