పది రోజులపాటు లవంగం నీరు తాగితే మీ శరీరంలో అద్భుతాలు చూస్తారు!
లవంగం అనే చిన్న మసాల దినుసు మనం తీసుకునే ఆహార పదార్థాలను రుచికరంగా మార్చడంతోపాటు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. పొట్ట, ఊపిరిత్తులు, దంతాలు, చర్మ సమస్యలకు లవంగాలు కలిపిన నీరును పది రోజులపాటు క్రమంగా తాగి చెక్ పెట్టవచ్చు. లవంగాల నీరు తాగడంతో నాణ్యమైన నిద్రను కూడా పొందవచ్చు.

మన పూర్వకాలం నుంచి వంట గదిలో లవంగం అనేది ఎంతో ప్రాధాన్యం గల మసాల దినుసు. ఆహార పదార్థాలను రుచికరంగా మార్చడంతోపాటు శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. లవంగం అనేక ఆరోగ్య సమస్యలను కూడా నివారించేందుకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. లవంగం నీరు తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దూరం కావడంతోపాటు శరీరానికి కొత్త శక్తి వస్తుందంటున్నారు.
నేటి తరంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పొట్టలో సమస్యలు, చర్మ సమస్యలు, అలసట, శరీర నొప్పులు సర్వ సాధారణంగా మారిపోయాయి. సాధారణ మందులతోపాటు ఈ వ్యాధులు తగ్గించడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
లవంగంతో ఊపిరిత్తుల సమస్యలకు చెక్
ఒక వ్యక్తి 10 రోజులపాటు క్రమం తప్పకుండా లవంగాలు కలిపిన ఒక గ్లాసు నీటిని తాగితే.. మన శరీరానికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. లవంగాలు ఊపిరితిత్తులను శుభ్రపర్చడానికి చాలా ఉపయోగకరమని పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ తెలిపారు. లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుందని.. అది ఊపిరితిత్తుల శ్లేష్మాన్ని వదులు చేయడంలో సహాయపడుతుందన్నారు. దీంతో శ్వాసతీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
లవంగంతో పొట్ట సమస్యలు ఔట్
లవంగాల నీరు తాగడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థను లవంగం మెరుగుపరుస్తుంది. పొట్టను శుభ్రపరుస్తుంది. లవంగాల నీరు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడంలో, అజీర్ణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేగాక, చర్మం ప్రకాశంతంగా మారేందుకు దోహదపడుతుంది. లవంగాలలో యాంటిఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహపడుతుంది. దీని కారణంగా చర్మం, ముఖం సహజ మెరుపు సంతరించుకుంటుంది.
లవంగంతో దంత ఆరోగ్యం మెరుగు
లవంగాల నీరు తరచుగా సేవించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది పంటి నొప్పి, దుర్వాసన, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాల నీటిని 10 రోజులపాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఈ ప్రయోజనాలు పొందవచ్చు.
లవంగాల నీరుతో నాణ్యమైన నిద్ర
మంచి నిద్రకు అవసరమైన హర్మోన్ మెలటోనిన్ స్థాయిలను లవంగ నీరు సహజంగా సమర్థవంతంగా ఉంచుతుంది. పది రోజులపాటు లవంగాల నీరు తారు తాగడం వల్ల మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చు.