ఆర్జీవీపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. ‘పవర్‌‌స్టార్’‌ సినిమాపై కామెంట్‌

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మపై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ట్వీట్‌ వేయాలని వర్మ తనను గంటపాటు అడిగారని పూనమ్ అన్నారు.

ఆర్జీవీపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. 'పవర్‌‌స్టార్'‌ సినిమాపై కామెంట్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 29, 2020 | 5:04 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మపై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ట్వీట్‌ వేయాలని వర్మ తనను గంటపాటు అడిగారని పూనమ్ అన్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన కన్వర్జేషన్‌ మొత్తం రికార్డు చేసి సదరు పార్టీ మీడియా ప్రతినిధికి పంపినట్లు ఆమె వెల్లడించారు.

కాగా ఆర్జీవీ, పవర్‌స్టార్ టైటిల్‌తో సినిమాను ప్రకటించి విషయం తెలిసిందే. దీని గురించి ట్విట్టర్‌లో తెలుపుతూ.. ”ఆర్జీవీ ప్రపంచ థియేటర్‌ నుంచి వస్తోన్న తదుపరి చిత్రం పవర్‌స్టార్‌. ఇందులో పీ, కే, ఎమ్‌, ఎస్‌, ఎన్‌, బీ, టీ, ఎస్‌, ఒక రష్యన్‌ మహిళ, నాలుగు పిల్లలు, ఎనిమిది దున్నపోతులు ఉంటాయి. ఆ పాత్రలను అర్థం చేసుకున్న వారికి ఎలాంటి బహుమతులు ఉండవు” అని ట్వీట్ చేశారు.

దీనికి పూనమ్‌ స్పందిస్తూ.. ”ఇందులో ఆర్జీవీ అనే పాత్రను కూడా పెట్టండి. అమ్మాయిల బలహీనతలను తెలుసుకొని, వారిని రెచ్చగొట్టి, ఆ స్క్రీన్‌ షాట్లను మీడియాతో పంచుకోవడం వంటివి అతడు చేస్తుంటాడు. చిన్నప్పుడు మిమ్మల్ని ఎంతో గౌరవించా. కానీ ఇప్పుడు బాధపడుతున్నా” అని కామెంట్ పెట్టారు. మరో ట్వీట్‌లో.. ”ఓ దర్శకుడు ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తన బ్రెయిన్‌ను దాదాపు గంటసేపు వాష్ చేశాడు. ఆ మెసేజ్‌లను సదరు పార్టీ ప్రతినిధులకు పంపాను. కొందరైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు. అతడి దురుద్దేశాన్ని తనకు కొందరు మీడియా వారు తెలిపారు” అని పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్‌ పవన్‌ను ఉద్దేశించి పూనమ్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.