Pelli Sandadi: దర్శకేంద్రుడి మేకింగ్‌ స్టైల్‌కు ఈ తరం కూడా ఫిదా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ పాటే రుజువు..

Pelli Sandadi: ఒక్కో దర్శకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే వారిని మిగతా వారి నుంచి ప్రత్యేకంగా చూపుతుంది. ముఖ్యంగా కొందరు ఫైటింగ్‌లు సీన్లు బాగా తీస్తే కొందరు రొమాంటిక్‌ సన్నివేశాలు బాగా తెరకెక్కిస్తారు. ఇలా పాటలను..

Pelli Sandadi: దర్శకేంద్రుడి మేకింగ్‌ స్టైల్‌కు ఈ తరం కూడా ఫిదా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ పాటే రుజువు..
Pelli Sandadi Song
Follow us

|

Updated on: Nov 11, 2021 | 6:04 PM

Pelli Sandadi: ఒక్కో దర్శకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే వారిని మిగతా వారి నుంచి ప్రత్యేకంగా చూపుతుంది. ముఖ్యంగా కొందరు ఫైటింగ్‌లు సీన్లు బాగా తీస్తే కొందరు రొమాంటిక్‌ సన్నివేశాలు బాగా తెరకెక్కిస్తారు. ఇలా పాటలను అద్భుతంగా తెరకెక్కించే వారిలో ముందు వరుసలో ఉంటారు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. హీరోయిన్‌ అందాన్ని అద్భుతంగా చూపిస్తూ.. పాటలను అత్యంత అద్భుతంగా తెరకెక్కించడంలో రాఘవేంద్రరావుకు మరొకరు సాటిరారు. అయితే ఇదంతా గతం.. ఈ తరం వారు అలాంటి పాటలను పెద్దగా ఇష్టపడరు అని అనుకుంటే మనం పొరపడినట్లే ఎందుకంటే. తాజాగా యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఓ పాట రాఘవేంద్ర రావు ప్రతిభ ఈ తరం వారిని కూడా ఆకర్షిస్తుందని చెప్పకనే చెబుతోంది.

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ రీఎంట్రీగా వచ్చిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇందులో రోషన్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాలోని ‘మధురా నగరిలో’ అనే వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.

విడుదల చేసిన కేవలం తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఒక కోటికి పైగా (ప్రస్తుతం కోటి 30 లక్షలు) వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండిగ్ లో టాప్ 5లో కొనసాగుతోంది.  కీరవాణి అందించిన అద్భుతమైన సంగీతంతో పాటు రాఘవేంద్రరావు తెర మీద ఆవిష్కరించిన తీరుకు ఫిదా అవుతున్నారు. దీంతో ఆ ఆతరం.. ఈ తరం అనే తేడా లేకుండా రాఘవేంద్ర రావు శైలికి అందరూ ఫిదా అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Pushpaka Vimanam: లేచి పోయిన భార్య ప్లేస్‌లో మరో భార్యను తెచ్చిన చిట్టిలంక సుందర్‌.. ‘పుష్పక విమానం’ కొత్త ప్రోమో చూశారా.?

5G Spectrum: వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం!.. టెలికాం రంగంలో మరిన్ని మార్పులు..

Jacinda Ardern: ఆమె దేశానికి ప్రధాని అయినా కూతురికి అమ్మే కదా.. న్యూజిలాండ్‌ ప్రధానిపై నెటిజన్ల ప్రశంసలు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు