5G Spectrum: వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం!.. టెలికాం రంగంలో మరిన్ని మార్పులు..
5జీ స్పెక్ట్రమ్ కోసం వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన చర్యలు మొదటి సంస్కరణలుగా చెప్పారు....
5జీ స్పెక్ట్రమ్ కోసం వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన చర్యలు మొదటి సంస్కరణలుగా చెప్పారు. ప్రభుత్వం మరిన్ని సంస్కరణల తీసుకువస్తుంది పేర్కొన్నారు. “రాబోయే 2-3 సంవత్సరాలలో టెలికాం నియంత్రణ వ్యవస్థ మారాలి” అని వైష్ణవ్ చెప్పారు. దేశ టెలికాం రంగ నియంత్రణను గ్లోబల్ బెస్ట్‌తో బెంచ్‌మార్క్ చేయాలన్నారు. “కాబట్టి, మేము ఇందులో వరుస సంస్కరణలతో వస్తాం” అని చెప్పారు. 5G వేలం కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంప్రదింపులు జరుపుతోందని వైష్ణవ్ వెల్లడించారు.
“ఫిబ్రవరి-మధ్యలోగా వారు తమ నివేదికను సమర్పిస్తారని నేను భావిస్తున్నాను. బహుశా ఫిబ్రవరి-చివరిలో మార్చి మొదట్లో నివేదిక రావొచ్చు. ” అని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5G వేలం నిర్వహించాలని భావిస్తుందన్నారు. ట్రాయ్ తన అభిప్రాయాలను ఖరారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే దానిపై 5జీ స్పెక్ట్రమ్ వేలం ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. “ఇది కేవలం మా అంచనా మాత్రమే.” అని అన్నారు. వేలం సాంకేతికత-తటస్థంగా ఉండేలా చూడడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. రాబోయే చాలా సంవత్సరాలకు స్థిరంగా ఉండే స్పెక్ట్రమ్‌ను అందించాలని కోరుకుంటోంది.” అని చెప్పారు.
వచ్చే ఏడాది 5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నందున, బహుళ బ్యాండ్‌లలోని రేడియోవేవ్‌లకు సంబంధించిన ధర, క్వాంటం, ఇతర పద్ధతులపై సిఫార్సులను కోరుతూ DoT ట్రాయ్‌ని సంప్రదించిందన్నారు. వీటిలో 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz వంటి బ్యాండ్‌లు ఉన్నాయి, అలాగే 3,300-3,600 MHz బ్యాండ్‌లు (అవి గత వేలంలో లేవు). ఈ ఏడాది మార్చిలో జరిగిన చివరి రౌండ్ స్పెక్ట్రమ్ వేలంలో 855.6 MHz స్పెక్ట్రమ్‌కు ₹77,800 కోట్లకు పైగా బిడ్‌లు వచ్చాయి.
రానున్న 2-3 ఏళ్లలో టెలికాం నియంత్రణ వ్యవస్థలో మార్పు రావాలని, “మొదటి ప్రాథమిక మార్పు” ఇప్పటికే జరిగిందని మంతి తెలిపారు. చట్టబద్ధమైన బకాయిలు చెల్లించకుండా కంపెనీలకు నాలుగేళ్ల విరామం ఇచ్చామని వెల్లడించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనాన్ని అందించడానికి ఉద్దేశించిన చర్యలు, భవిష్యత్తులో స్పెక్ట్రమ్ వేలంలో పొందిన ఎయిర్‌వేవ్‌ల కోసం స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీని (SUC) రద్దు చేయడం కూడా ఉన్నాయని చెప్పారు. టెలికాం రంగంలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ కలిగి ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత 2023 మధ్య నాటికి సాకారం అవుతుందని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
” 4G, 5G, 6G ఈ మొత్తం టెక్నాలజీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండూ భారతదేశంలో అభివృద్ధి చేందుతాయి. 5G కోసం 70-75 శాతం పని జరిగింది. ఫిబ్రవరి నాటికి, మేము మొత్తం 5G సాఫ్ట్‌వేర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.” అని చెప్పారు. 6Gను అభివృద్ధి చేస్తామని తెలిపారు.