Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: అన్నదాతలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు.. మారిన రూల్స్ తెలుసుకోండి..

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

PM Kisan: అన్నదాతలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు.. మారిన రూల్స్ తెలుసుకోండి..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 11, 2021 | 9:58 AM

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేల వరకు ఆర్థిక భరోస కల్పిస్తున్నాడు. అయితే నేరుగా ఈ డబ్బులను రైతుల ఖాతాల్లోకి పంపుతారు. కానీ విడతల వారిగా వీటిని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో పలు మార్పులు చేర్పులు చేశారు. తాజాగా మారిన రూల్స్ విధానం ప్రకారం పొలం ఎవరి పేరు మీద ఉంటుందో ఆ రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. అంటే పూర్వీకుల భూమిలో భాగస్వామ్యం ఉన్నవారు ఇకపై పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందలేరు. మీ పేరు మీద పొలం ఉన్నట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదు.. విడతల వారిగా రైతుల ఖాతాల్లోకి జమవుతుంది. అందులో ప్రతి సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు.. రెండవ విడత.. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు.. మూడవ విడత.. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వస్తుంది. ఇక మారిన రూల్స్ ప్రకారం.. పీఎం కిసాన్ పథకం కింద కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఇప్పుడు దరఖాస్తు ఫారంలో తమ భూమి ప్లాట్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనలు పాత లబ్ధిదారులపై ప్రభావం ఉండదు. ఈ పథకంలో నమోదు చేసుకోవడం చాలా సులభం.. ఆన్‏లైన్లో ఇంట్లో కూర్చోని ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. ఈ పథకం కోసం పంచాయతీ కార్యదర్శి లేదా పట్వారీ లేదా స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* పీఎం కిసాన్ అధికారిక వెబ్‎సైట్‏కు లాగిన్ కావాలి. * ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. * ఆ తర్వాత న్యూఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. * ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. * దీంతోపాటు.. క్యాప్చా కోడ్ నమోదు చేసి..మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. * ఈ ఫారంలో మీరు మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ వివరాలు.. పొలానికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి.

Also Read: Pelli SandaD: సినీ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌

Nandamuri Balakrishna: నట సింహం 107 సినిమాకు ముహూర్తం ఫిక్స్.. మూవీ ప్రారంభోత్సవం ఎప్పుడంటే..