Jacinda Ardern: ఆమె దేశానికి ప్రధాని అయినా కూతురికి అమ్మే కదా.. న్యూజిలాండ్‌ ప్రధానిపై నెటిజన్ల ప్రశంసలు..

ఎందరో దేశాధినేతలకు సాధ్యం కానీ విధంగా కరోనా మహమ్మారికి కళ్లెం వేసి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌. అయితే ఒక దేశాధినేతగా ఆమె..

Jacinda Ardern: ఆమె దేశానికి ప్రధాని అయినా కూతురికి అమ్మే కదా.. న్యూజిలాండ్‌ ప్రధానిపై నెటిజన్ల ప్రశంసలు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2021 | 4:34 PM

ఎందరో దేశాధినేతలకు సాధ్యం కానీ విధంగా కరోనా మహమ్మారికి కళ్లెం వేసి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌. అయితే ఒక దేశాధినేతగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అమ్మతనం ముందు ఆ దర్పం కనపడనీయదు. అందుకు జెసిండా సోషల్‌ మీడియా ఖాతాలే నిదర్శనం. 2018లో ప్రధాని పదవిలో ఉండగానే జెసిండా నెవెకు అనే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. బిడ్డతోనే న్యూయార్క్‌ ఐరాస సమావేశానికి హాజరైన సంగతి తెలిసింది. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచాయి. ఆతర్వాత కూడా తన గారాల పట్టితో సరదాగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఎంత సేపు మమ్మీ.. ఇక తాజా విషయానికొస్తే… ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కూడా డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా సంబంధిత అధికారులతో జెసిండా సమావేశమయ్యారు. కొవిడ్‌ ఆంక్షల సవరింపుపై ఆమె మాట్లాడుతుండగా హఠాత్తుగా ‘మమ్మీ’ అంటూ నెవె పిలుస్తుంది. అప్పుడు జెసిండా ‘ఇది నిద్రపోయే సమయం తల్లీ’ అని కూతురికి చెప్పగా ..’నో’ అంటూ అటునుంచి ఆన్సర్‌ వస్తుంది. ఆతర్వాత ‘ఇప్పుడు నువ్వు నిద్రపోవాలమ్మా.. వెళ్లి పడుకో.. నేను ఒక నిమిషంలో వచ్చేస్తా ‘ అంటూ కూతురికి సర్దిచెప్పారు. కానీ నెవె మాత్రం నిద్రపోదు. ‘ఇంకా ఎంత సేపు మమ్మీ’ అంటూ తల్లిని పిలుస్తూనే ఉంటుంది. దీంతో లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఆపి కూతురి దగ్గరకు వెళుతుంది. కొద్ది సేపటి తర్వాత మళ్లీ లైవ్‌లోకి వచ్చి నవ్వుతూ ‘అంతరాయం కలిగినందుకు అందరూ నన్ను క్షమించాలి. మనం ఎక్కడి దాకా వచ్చాం’ అంటూ సమావేశాన్ని కొనసాగిస్తారు. ఒక దేశ ప్రధానిగా ఉండి ఎటువంటి దర్పానికి పోకుండా అధికారులను క్షమాఫణలు అడగడం, ముఖ్యంగా తల్లీ కూతుళ్ల మధ్య సరదాగా సాగిన సంభాషనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Also Read:

Russian President: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్

China Warning: కోల్డ్ వార్‌కు మీరే కారణం.. ప్రపంచ దేశాలకు డ్రాగన్ కంట్రీ వార్నింగ్..

Coronavirus: కరోనా బారిన పెంపుడు కుక్క.. యజమాని నుంచి వ్యాపించినట్లు వైద్యుల నిర్ధారణ..