Russian President: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్

Russian President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు మొదటి వారంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. డిసెంబర్ 6న పుతిన్ ఢిల్లీకి రానున్నారని..

Russian President: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్
Russian President
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2021 | 3:46 PM

Russian President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు మొదటి వారంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. డిసెంబర్ 6న పుతిన్ ఢిల్లీకి రానున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. అయితే పుతిన్ ఒక్కరోజు మాత్రమే భారత్ లో పర్యటించనున్నారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇక రష్యా తయారు చేసిన అత్యాధునిక  S400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ మనదేశానికి ఈ ఏడాది చివరి నాటికి  చేరుకోనున్నాయి.

వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం పుతిన్ చివరిసారిగా 2018లో భారత్‌ను సందర్శించారు.  ఆ  సమయంలోనే భారతదేశం ,  రష్యా మధ్య S400 సిస్టమ్ కోసం ఒప్పందం కుదిరింది.  అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్ళీ మనదేశం రావడం ఇదే..  కరోనా కల్లోలం తర్వాత  ఈ ఏడాది పుతిన్  చేస్తున్న విదేశీ పర్యటనలో మన దేశం రెండోది. ఆయన మొదట జెనీవా సమావేశానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇటీలీలో జరిగిన జీ20 సమావేశాలకు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు.

గత సంవత్సరం, కోవిడ్ సంక్షోభం కారణంగా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగలేదు.  భారతదేశం , రష్యాలో ప్రత్యామ్నాయంగా 20 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. 2019లో ప్రధాని మోడీ  తూర్పు రష్యా నగరమైన వ్లాడివోస్టాక్‌ను సందర్శించారు.  అంతేకాదు మోడీ 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌కు గౌరవ అతిథిగా కూడా హాజరయ్యారు. కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్నా శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రసుత్తం  ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

రష్యా యొక్క స్పుత్నిక్ V వ్యాక్సిన్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతోంది. అంతేకాదు భారత కరోనా సెకండ్ వేవ్ సమయంలో సంక్షోభంలో చిక్కుకుంది. అప్పుడు రష్యా మానవతా దృష్టితో స్పందించింది. భారత్ కు సహాయ సహకారాలను అందించింది.  మరోవైపు ఆగస్టులో కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి రష్యా జాతీయ భద్రతా సలహాదారు (భద్రతా మండలి సెక్రటరీ) నికోలాయ్ పి. పత్రుషేవ్  దేశంలోని పరిస్థితిని చర్చించడానికి ఢిల్లీకి రెండు సార్లు వచ్చారు.  భారతదేశం అతిపెద్ద రక్షణ భాగస్వామి రష్యా. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్నా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:  కేవలం 103 రోజుల్లోనే పూర్తి చేసుకున్న ప్రభాస్ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీ..