Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Adipurush: కేవలం 103 రోజుల్లోనే పూర్తి చేసుకున్న ప్రభాస్ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీ..

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రం 'ఆదిపురుష ' షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్..

Prabhas Adipurush: కేవలం 103 రోజుల్లోనే పూర్తి చేసుకున్న ప్రభాస్ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీ..
Adipurush Shooting
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2021 | 3:14 PM

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రం ‘ఆదిపురుష ‘ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ శ్రీరామునిగా నటిస్తుండగా, కృతి సీత పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ను 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ను ఈ సంవత్సరం ప్రారంభంలో ముంబైలో ప్రారంభించింది చిత్ర బృందం. తాజాగా  ఈ సినిమా పూర్తయిందని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది.

తాజాగా చిత్ర బృందం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్నీ ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ సహా ఇతరులు ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.  అంతేకాదు దర్శకుడు ఓం రౌత్ సెట్స్ మీద విషయాలను షేర్ చేస్తూ.. ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయం అద్భుతమైన ప్రయాణం.. అయితే ఈ జర్నీ ముగింపు దశకు వచ్చింది. మేము సృష్టించిన అద్భుతాన్ని మీతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.. ఆదిపురుష్ , 103 డేస్ ఆఫ్ షూట్ హ్యాష్ టాగ్స్ తో ఓ వీడియో షేర్ చేశారు.

రామాయణం నేపథ్యంలో పౌరాణిక సినిమాగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్వరుడు రావణుడు గా సైఫ్ అలీఖాన్, దేవదత్తా నాగే,వత్సల్ శేత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ సినిమాను భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ లు  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ 2022 ఆగష్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో జనవరి 14, 2020 న ప్రేక్షకుల ముందుకు రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. అంతేకాదు డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.  నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ ‘సాలార్’ చిత్రాల్లో ప్రభాస్  నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  మళ్ళీ శోకసంద్రంలో వంటలక్క.. బోర్ కొట్టేసిందంటున్న ప్రేక్షకులు.. దారుణంగా పడిపోయిన TRP రేటింగ్