3 Roses AHA: అసలు ఒకరి నీడలో బతకాల్సిన అవసరం అమ్మాయిలకు ఎందుకు.? ఆకట్టుకుంటోన్న 3 రోజెస్ ట్రైలర్..
3 Roses AHA: తొలి తెలుగు ఓటీటీ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌కు వేదిక కానుంది. ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిందే '3 రోజెస్' వెబ్ సిరీస్. మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు..
3 Roses AHA: తొలి తెలుగు ఓటీటీ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌కు వేదిక కానుంది. ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిందే ‘3 రోజెస్’ వెబ్ సిరీస్. మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. అంటే సిరీస్ మొత్తం మారుతి పర్యవేక్షణలోనే తెరకెక్కిందన్నమాట. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరి ముగ్గురి చుట్టూ తిరిగే కథే ఈ ‘3 రోజెస్’. ఇక ఈ వెబ్ సిరీస్ ఆహా వేదికగా నవంబర్ 12 నుంచి టెలికాస్ట్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికి రేకెత్తిస్తోంది. స్వతంత్ర్య భావాలున్న ముగ్గురు మహిళల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈ ముగ్గురు మూడు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ ముగ్గురు పడుతోన్న ఏకైక సంస్థ పెళ్లి. వయసు పెరుగుతోన్న పెళ్లి కాని పాత్రలో పూర్ణ, తనకు ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే పాత్రలో ఈషా రెబ్బా, ట్రెక్కింగ్‌పై ఆసక్తితో స్వతంత్ర్యంగా జీవితాన్ని గడాపాలనుకునే పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు.
మరి జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించాలనుకునే ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే. ఇక దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌లో బలమైన కథను చూపిస్తూనే మరోవైపు బోల్డ్ కంటెంట్‌ను, వెబ్ సిరీస్‌లకు సొంతమైన బోల్డ్ డైలాగ్‌లను ఉపయోగించాడు. దీంతో ఈ సిరీస్ యూత్‌ను అమితంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
Also Read: Eye Care Tips: కంటి చూపు మెరుగుపడాలంటే ఈ టిప్స్ పాటించండి.. పవర్‌ఫుల్ చిట్కాలు మీకోసం..