Eye Care Tips: కంటి చూపు మెరుగుపడాలంటే ఈ టిప్స్ పాటించండి.. పవర్‌ఫుల్ చిట్కాలు మీకోసం..
Eye Care Foods: ఆధునిక జీవితంలో చాలామంది కంటి సమస్యలతో ఇబ్బుందులు పడుతున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్‌లు, ఫోన్‌లు చూడటం వల్ల అనేక మంది కంటి చూపు సమస్యలను
Eye Care Foods: ఆధునిక జీవితంలో చాలామంది కంటి సమస్యలతో ఇబ్బుందులు పడుతున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్‌లు, ఫోన్‌లు చూడటం వల్ల అనేక మంది కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వయస్సు మీద పడకపోయినా.. జీవనశైలి మార్పులతో.. చిన్న వయస్సులోనే కంటి చూపునకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న జీవనశైలి ప్రకారం.. కంటి సంరక్షణ కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. ఈ ఆహారాలు మీ కంటి సమస్యలను దూరం చేసి మంచి కాంతిని అందించడంలో సహాయపడతాయి. కంటి సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం.. ఆహారంలో ఏయే పదార్థాలు చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర: పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి మీ కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండటంతోపాటు.. రోగనిరోధకశక్తి బలంగా మారుస్తాయి. దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి సమస్యలను దూరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
నారింజ: కంటి సమస్యలను నారింజలు దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలతో పోరాడి కంటి చూపును వృద్ధి చేస్తాయి. నారింజ మీ రెటీనాకు అవసరమయ్యే విటమిన్ ఎ ను అందిస్తాయి.
చిలగడదుంప: చిలగడదుంపలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది మీ శరీరాన్ని ఉత్తేజపర్చడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు మీ ఆరోగ్యాన్ని కాపడటంతోపాటు.. మీ కళ్ళకు కూడా చాలా పోషకాలను అందిస్తాయి. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియ వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. మీ కళ్ళకు మెరుగైన దృష్టిని అందిస్తాయి.
మిరపకాయ: రెడ్ క్యాప్సికమ్‌లో ఎ, సి, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మిరపకాయలతో మీ కళ్లకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి కంటికి ఎలాంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా నిరోధిస్తాయి. దీంతోపాటు రెటీనాను ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయపడతాయి.
క్యారెట్ రసం: క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇది కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
Also Read: