ఉద్యోగాలు చేసే మహిళలు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు.. ఆరోగ్యం కోసం ఇవి చేయాల్సిందే..
మహిళలు.. మానసికంగానే కాదు.. శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు..తమ శరీరాన్ని ఫిట్‌గా
మహిళలు.. మానసికంగానే కాదు.. శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు..తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు సరైన ఆహారం మాత్రమే కాకుండా.. రోజూ వ్యాయమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పని ఒత్తిడి.. ఇంట్లో సమస్యలన్నింటితో మహిళలు మానసికంగా బలహీనంగా మారిపోతుంటారు. అలాంటి సమయంలో రోజంతా ఉద్యోగం చేయడం వలన తొందరగా అలసిపోవడం.. నీరసించిపోవడం జరుగుతుంది. అందుకే మహిళలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. శారీరకంగానూ ఫిట్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవెంటో తెలుసుకోండి.
1. శరీరంలో 70 శాతం నీరు ఉండాలి. అందుకే రోజులో ఎక్కువగా నీరు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీంతో శరీరంలోని పలు భాగాలు సరిగ్గా పనిచేయవు. అందుకే రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. 2. ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం వలన శరీరంపై శ్రమ పడుతుంది.అందుకే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సీట్ నుంచి లేచి జంపింగ్.. నడడం చేస్తుండాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. 3. ఉదయాన్నే నిద్రలేచి అరగంట పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వలన శరీరంలోని కండరాలు టోన్గా ఉంటాయి. 4. రోజులో కొంత సమయం యోగా..ధ్యానానికి కేటాయించాలి. ఇలా చేయడం వలన మానసిక ఆరోగ్యానికి మంచిది. అలాగే ఫిట్‌గా ఉంటారు. 5. ఉద్యోగం చేస్తున్న సమయంలో కూర్చీలో ఎక్కువ సమయం కూర్చోకుండా..అప్పడప్పుడు నడవాలి.. లేదా మెట్లు ఎక్కాలి. 6. ఫిట్ గా ఉండాలంటే.. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మహిళలకు కాల్షియం.. ఐరన్ రిచ్ ఫుడ చాలా ముఖ్యం. ఇవే కాకుండా.. పండ్లు.. కూరగాయలు, గింజలు..చిక్కుళ్లు మొదలైనవి తీసుకోవాలి. రోజులో 5-6 సార్లు తక్కువ పరిమాణంలో భోజనం చేయాలి. ఇలా చేస్తే స్థూలకాయం సమస్య తగ్గుతుంది.
Also Read: Nagineedu: మర్యాద రామన్న సినిమా నాకు మైనస్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగినీడు..
Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..
Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే..