- Telugu News Photo Gallery Know what happens if we do not eat sugar for a month changes happen to health
Sugar Side Effects: డయాబెటిక్ బాధితులూ జర జాగ్రత్త.. ఒక్కసారిగా స్వీట్ తినడం మానేస్తున్నారా..!
మీరు ఒక నెల పాటు చక్కెర తినడం మానేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. దాని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా.. అసలు చక్కెర శరీరానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Nov 11, 2021 | 10:36 AM

మిగతా పోషకాల మాదిరిగా శరీరానికి చక్కెర కూడా అవసరం. దాన్ని ఏదొక రూపంలో నిర్దిష్ట మోతాదులో తీసుకోవాలి. అది టీ, కాఫీ లేదా స్వీట్‌లు కావచ్చు. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఉండేందుకు అందరూ కనీసం రోజుకొక స్వీట్ అయినా తింటారు. కానీ మీరు స్వీట్లు తినడం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా.?

చక్కెరలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి శుద్ధి చేసిన చక్కెర కాగా, మరొకటి సహజ చక్కెర. వీటిల్లో సహాజ చక్కెర మీ శరీరానికి చాలా అవసరం. అది మీ శక్తి సామర్ధ్యాలను పెంచడమే కాకుండా దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం సైతం పెరిగేలా చేస్తుంది. ఇదిలా ఉంటే శుద్ధి చేసిన చక్కెర మీ శరీరానికి అనే విధాలుగా హని చేస్తుంది.

షుగర్ మానేస్తే ఏం జరుగుతుంది.? డ్రగ్స్ మానేసిన తర్వాత ఎలా అయితే ఉంటుందో.. షుగర్‌ను పూర్తిగా మానేసినప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉంటుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాకుండా దీని వల్ల మీ శరీరంలో అలసట, తలనొప్పి, మెడ తిమ్మిర్లు, చిరాకు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా మీ కడుపుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

మంచి అనుభూతినిచ్చే హార్మోన్లు, డోపమైన్, సెరోటోనిన్‌లు చక్కెర నుంచి విడుదలవుతాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం.

మీరు చక్కెరను తినడం పూర్తిగా మానేసినప్పుడు మొదటిగా చిరాకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తలనొప్పితో పాటు డిప్రెషన్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఈ సమస్యలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. మళ్లీ మీరు సాధారణ స్థితికి రాగలరు.





























