Karthika Deepam: మళ్ళీ శోకసంద్రంలో వంటలక్క.. బోర్ కొట్టేసిందంటున్న ప్రేక్షకులు.. దారుణంగా పడిపోయిన TRP రేటింగ్
Karthika Deepam: సినిమాలకైనా, సీరియల్స్ కైనా కథలు ఎక్కడా కొత్తగా దొరకవు... ఉన్న కథలనే.. సరికొత్త కథనంతో ప్రేక్షకులకు ఆసక్తికలిగేలా తెరకెక్కిస్తే..ఆదరణ సొంతం..
Karthika Deepam: సినిమాలకైనా, సీరియల్స్ కైనా కథలు ఎక్కడా కొత్తగా దొరకవు… ఉన్న కథలనే.. సరికొత్త కథనంతో ప్రేక్షకులకు ఆసక్తికలిగేలా తెరకెక్కిస్తే..ఆదరణ సొంతం చేసుకుంటుందని ఓ ఫేమస్ డైరెక్టర్ చెప్పారు. ఇదే విషయాన్నీ కార్తీక దీపం సీరియల్ రోజు చెసింది. పాత కథ అయినా.. నటీనటుల నటన , ఆసక్తి కలిగించే కథనంతో తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టించింది. ఒక్క తెలుగులోనే కాదు.. యావత్ భారత దేశంలోని స్మాల్ స్క్రీన్ పై రికార్డ్ స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్ ను నమోదు చేసింది. ఈ సీరియల్ లో దీప అలియాస్ వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాథ్ సినీ హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారు అన్న సస్పెన్స్ తో ఓ రేంజ్ లో టీఆర్ఫీ ని సొంతం చేసుకుని బడాబడా హీరోలకే షాక్ ఇచ్చింది.
అయితే ఎప్పుడైనా అతి సర్వత్రా వర్జయేత్.. చూస్తున్నారు .. ఆదరిస్తున్నారు కదా అంటూ సీరియల్ ను రోజు రోజుకీ సాగదీసుకుంటూ పోతున్నారు. డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయారు.. మోనిత జైలు కు వెళ్ళింది అనుకున్న ప్రేక్షకులకు మళ్ళీ మోనిత ను కార్తీక్ ను దగ్గర చేస్తూ.. వంటలక్క ను శోకసంద్రంలో ముంచేలా మళ్ళీ కథ సాగుతుంది. విలన్ మోనిత పిల్లాడి కనడం.. బయటకు వచ్చి.. ఎప్పటిలాగే ప్లాన్స్ వేస్తూ.. దీపని, కార్తీక్ ని ఇబ్బంది పెట్టడం చేస్తుంది. ఇవన్నీ ప్రేక్షకులకు బోర్ కొట్టేసినట్లు ఉన్నాయి. దీంతో అర్బన్, రూరల్ ఇక్కడకూడా కార్తీక్ దీపం సీరియల్ వైపు ప్రేక్షకులు లుక్ వేయనట్లుంది. దీంతో ఆల్ టైం హై రేటింగ్ తో రికార్డ్ సృష్టించిన కార్తీక దీపం సీరియల్ రేటింగ్ ఇపుడు దారుణాతిదారుణంగా పడిపోయింది.
ఎంతగా అంటే.. ఒకప్పుడు స్టార్ హీరోలు హోస్ట్ చేసిన బిగ్ బాస్ , కొత్త సినిమాలు, జబర్దస్త్ షోలు ఏవీ కార్తీక్ దీపం హవా ముందు నిలబడలేకపోయేవి. అయితే ఇప్పుడు కనీసం రిపీట్ సినిమాలకు వస్తున్న రేటింగ్ కూడా రావడం లేదు. మళ్ళీ దర్శకుడు కార్తీక దీపం ని రేస్ లో నిలబెట్టాలి అంటే సరికొత్త పంథా మార్చాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.. లేదంటే.. ఇక రేటింగ్ లేదని.. ముగింపు అయినా చెప్పాల్సిందే అంటున్నారు.
Also Read: