T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!

టీ20 వరల్డ్ కప్ 2021 మొదటి ఫైనలిస్ట్ ఖరారైంది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం నమోదు..

T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!
Pakistan
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 11, 2021 | 1:35 PM

టీ20 వరల్డ్ కప్ 2021 మొదటి ఫైనలిస్ట్ ఖరారైంది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం నమోదు చేసుకుని న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక రెండో ఫైనలిస్ట్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇవాళ పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సెకండ్ సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందుగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్‌లకు తేలికపాటి జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల బుధవారం వారిరువురూ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదట. దీనిపై జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు జరపగా.. నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిగతా టీం మొత్తానికి కూడా కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ వచ్చిందట.

జట్టును అజేయంగా నిలపడంలో ఈ ఇద్దరూ కీలకం..

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని ఏకైక జట్టు పాకిస్థాన్‌. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-12లోకి దూసుకెళ్లింది. ఇక పాకిస్తాన్ జట్టు విజయాల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి. ఇక సరిగ్గా సెమీఫైనల్ టైంలో వీరిద్దరూ జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక మాలిక్ జట్టు మిడిల్ ఆర్డర్ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై లక్ష్యాన్ని ఛేదించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. స్కాట్లాండ్‌పై అతడి ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కాగా, ఈ ఇద్దరి ఆటగాళ్ల స్థానంలో పాకిస్తాన్ టీం యాజమాన్యం.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఓపెనర్ ఫకార్ జమాన్ తీసుకునే అవకాశం ఉంది.

Also Read:

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?