Sanju Samson Birthday: ప్రతిభ ఫుల్.. అదృష్టం మాత్రం నిల్.. ఐపీఎల్‌లో హిట్టయినా.. టీమిండియాలో జీరోగా మారిన కేరళ స్టార్ ప్లేయర్..!
Sanju Samson: తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌లో ఇప్పటివరకు సంజూ శాంసన్ 121 మ్యాచ్‌ల్లో 29.21 సగటుతో 3,068 పరుగులు చేశాడు.
Sanju Samson Birthday: సంజూ శాంసన్ భారత క్రికెట్‌లో వర్ధమాన స్టార్‌గా అవతరించాడు. తన సొంత రాష్ట్రమైన కేరళ తరపున ప్రధాన పోటీదారుడిగా నిలిచాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్‌గా డొమెస్టిక్ టోర్నమెంట్లలో అత్భుతంగా అలరించాడు. అయితే గత కొన్నేళ్లుగా సెలెక్టర్లు సంజూపై పెద్దగా విశ్వాసం చూపించడం లేదు. న్యూజిలాండ్ సిరీస్‌లోనూ తనను ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2021లో అద్భుతంగా రాణించిన వారిలో సంజూ శాంసన్ కూడా ఒకరు. అయితే దక్షిణాఫ్రికా ఏతో తలపడిన భారత ఏ జట్టులో సభ్యుడిగా 48 బంతుల్లో 91 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిమిత అవకాశాలతోనే తన కెరీర్‌ను నెట్టుకొస్తున్నాడు. అయితే నేడు తన 27 వ పుట్టిన రోజు నిర్వహించుకోనున్న శాంసన్.. 1994, నవంబర్ 11న జన్మించాడు.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా 2019లో విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై కేరళ తరఫున ఆడి, అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ డబుల్ సెంచరీ (212 నాటౌట్) సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శాంసన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అయినా సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదు. 2015లో జింబాబ్వేపై తన టీ20ఐ అరంగేట్రం చేసిన శాంసన్.. వన్డే అరంగేట్రం కూడా అదే ఏడాదిలో శ్రీలంకపై జరిగింది. ఐదేళ్లలో శాంసన్ భారత్ తరఫున కేవలం నాలుగు టీ20ల్లో మాత్రమే ఆడాడు.
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ తరపున బరిలోకి దిగాడు. కానీ, మైదానంలో మాత్రం బ్యాటింగ్ చేయలేకపోయాడు. IPL సీజన్ 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఎంపికయ్యాడు. ఏప్రిల్ 13, 2013న ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2018లో జైపూర్ తరపున చేరడానికి ముందు రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున కూడా ఆడాడు.
తన IPL కెరీర్‌లో ఇప్పటివరకు శాంసన్ 121 మ్యాచ్‌లలో 29.21 సగటుతో 3,068 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ ఎడిషన్లలో సంజూ శాంసన్ కొన్ని అద్భుతమైన ఇన్సింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
63 బంతుల్లో 119 VS PBKS, 2021 పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శాంసన్ ఒంటరిగా పోరాడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ, శాంసన్ 63 బంతుల్లో 119 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే శాంసన్ జట్టు గెలవడానికి ఐదు పరుగులు అవసరం కావడంతో చివరి బంతికి ఔటయ్యాడు.
57 బంతుల్లో 82 VS SRH, 2021 కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై కేవలం 57 బంతుల్లో 82 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున శాంసన్ మరోసారి టాప్ స్కోర్ చేశాడు. దీంతో జట్టును 164/5కి తీసుకెళ్లాడు. ఇది అతని 15వ అర్ధశతకం. వరుసగా రెండవది. దీంతోనే 3000 IPL పరుగులను చేరుకున్న 19వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. SRH మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
42 బంతుల్లో 85 VS PBKS, 2020 కుడిచేతి వాటం బ్యాటర్ కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌పై 42 బంతుల్లో 85 పరుగులు చేశాడు. రాహుల్ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే 223 పరుగుల రికార్డు బద్దలు కొట్టడానికి సహాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 27 బంతుల్లో 50 పరుగులతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
55 బంతుల్లో 102 VS SRH, 2019 SRHకి వ్యతిరేకంగా 55 బంతుల్లో 102 పరుగులు చేసిన శాంసన్.. మొత్తం తన ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు, నాలుగు సిక్సర్‌లు బాదేశాడు. దీంతో RR 198/2 భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు. అప్పటి RR కెప్టెన్ అజింక్యా రహానేతో 75 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పంచుకున్నాడు. అయితే, SRH కేవలం 19 ఓవర్లలో మొత్తం ఛేజ్ చేసి ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
45 బంతుల్లో 92 VS RCB, 2018 ఇది 2018 ఎడిషన్‌లో శాంసన్ అత్యుత్తమ ఇన్నింగ్స్. కేవలం 45 బంతుల్లో 10 సిక్సర్లు, రెండు బౌండరీలతో 92 పరుగులు చేసి RRను 217 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. RR ఈ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
India vs New Zealand: టీమిండియా జెర్సీ ధరించడం మానాన్న కల.. నేటికి నెరవేరింది: ఇండోర్ ఫాస్ట్ బౌలర్