AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20ల నుంచి త్వరలో కోహ్లీ రిటైర్మెంట్.. డ్రెస్సింగ్ రూంలో ఆ వాతావరణమే కారణం: పాకిస్థాన్ మాజీ బౌలర్ కీలక వ్యాఖ్యలు

Virat Kohli: విరాట్ కోహ్లి టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత టీ20ఐ కెప్టెన్‌గా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం ఇందులో పరమార్థం ఏదో ఉందంటూ కామెంట్ చేశాడు.

టీ20ల నుంచి త్వరలో కోహ్లీ రిటైర్మెంట్.. డ్రెస్సింగ్ రూంలో ఆ వాతావరణమే కారణం:  పాకిస్థాన్ మాజీ బౌలర్ కీలక వ్యాఖ్యలు
Virat Kohli
Venkata Chari
|

Updated on: Nov 11, 2021 | 12:50 PM

Share

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ ముందుగానే నిష్క్రమించిన నేపథ్యంలో భారత అభిమానుల ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని కూడా వదులుకున్న సంగతి తెలిసిందే. భారత టీ20ఐ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ, కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రావడంతో, జట్టు కొత్త శకానికి నాంది పలకనుంది. అయితే, ప్రస్తుత భారత జట్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ ముష్తాక్ అహ్మద్ పేర్కొన్నాడు. ఇది కోహ్లీని టీ20ఐ కెప్టెన్‌గా వైదొలగడానికి ప్రేరేపించింది. 33 ఏళ్ల కోహ్లీ టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత టీ20ఐ కెప్టెన్‌గా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే ముష్తాక్ మాత్రం ఇందులో పరమార్థం వేరే ఉందని పేర్కొన్నాడు.

“ఒక విజయవంతమైన కెప్టెన్ తాను కెప్టెన్సీని వదిలిపెట్టాలనుకుంటున్నాను అని చెబితే, డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగోలేదని అర్థం. నేను ప్రస్తుతం ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులను చూస్తున్నాను. ఇందులో ముంబై, ఢిల్లీ గ్రూపులు ఉన్నాయి” అని ఆయన తెలిపారు.

1989 నుంచి 2003 మధ్యకాలంలో పాకిస్థాన్ తరఫున 52 టెస్టులు, 144 వన్డేలు ఆడిన ముస్తాక్, కోహ్లీ టీ20ల్లో ఎక్కువ కాలం కొనసాగడం తనకు కనిపించడం లేదని మరో బలమైన ప్రకటన చేశాడు. కోహ్లి T20I కెప్టెన్‌గా పదవీ విరమణ చేయడమే ఇందుకు కారణమంటూ మాజీ లెగ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. అయితే పొట్టి ఫార్మాట్ నుంచి త్వరలోనే రిటైర్మెంట్ కానున్నట్లు తెలుస్తుందని ప్రకటించాడు.

“ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగినప్పటికీ, కోహ్లీ తన దేశం కోసం టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం నుంచి త్వరలో రిటైర్ అవుతాడని నేను భావిస్తున్నాను. ఈ ఫార్మాట్‌ను పూర్తిగా వదిలేయనున్నాడని నేను భావిస్తున్నాను” అని ముస్తాక్ జియో న్యూస్ ఛానెల్‌లో చెప్పాడు.

చివరగా, ముస్తాక్ టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశం పేలవ ప్రదర్శనకు IPL కారణంగా నిలిచింది. దీంతో 9 సంవత్సరాల తరువాత ఐసీసీ టోర్నమెంట్‌లలో మొదటిసారిగా సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైంది. బిజీ షెడ్యూల్ కూడా ఓ కారణంగా నిలిచిందని ముష్తాక్ పేర్కొన్నాడు. “ఐపీఎల్ కారణంగానే భారత్ ప్రపంచకప్‌లో పరాజయం పాలైంది. ప్రపంచకప్‌కు ముందు బయో-సెక్యూర్ బబుల్‌లో చాలా కాలం పాటు ఉండిపోయిన ఆటగాళ్లు అలసిపోయారని నేను భావిస్తున్నాను” అని ముష్తాక్ పేర్కొన్నాడు.

Also Read: India vs New Zealand: టీమిండియా జెర్సీ ధరించడం మానాన్న కల.. నేటికి నెరవేరింది: ఇండోర్ ఫాస్ట్ బౌలర్

T20 World Cup 2021: చివరి 10 ఓవర్లలో 109 పరుగులు.. ఆనాడు వెస్టిండీస్.. ఈనాడు న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌‌ను ఒకేలా దెబ్బతీసిన ఇరుజట్లు..!

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!