Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..
తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పుడు ఫిమేల్ యాంకర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అందులో విష్ణు ప్రియ కూడా ఒకరు.
తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పుడు ఫిమేల్ యాంకర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అందులో విష్ణు ప్రియ కూడా ఒకరు. గతంలో ‘పోరా పోవే’ షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగిపోయింది. అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. ఇక ఈ బ్యూటీకి పెళ్లి గడియలు దగ్గరపడినట్లున్నాయి. త్వరగా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు ఆమె తాజా పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది.
నవంబర్ 11 అనేది సింగిల్స్ డే. దీంతో సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి అంటూ ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు… వచ్చే ఏడాది ఈ సమయానికి నేను సింగిల్‌గా ఉండను… కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుందని పేర్కొంది. విష్ణుప్రియ పోస్ట్‌ని బట్టి ఆమె వచ్చే ఏడాది ఈ సమయానికి ఇల్లాలు కాబోతుందని చెప్పకనే చెప్పింది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా లేదా పెద్దలు చూసిన సంబంధానికి పచ్చజెండా ఊపుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
అయితే గతంలో విష్ణుప్రియ అఖిల్ అక్కినేని, నవదీప్ వంటి హీరోలపై తన ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పేసింది. అఖిల్ ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆమె కామెంట్స్ బాగా వైరలయ్యాయి కూడా.
Also Read: Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు