సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌‍లో బైభీమ్ సీన్.. గిరిజన యువకుడిపై పోలీసుల ప్రతాపం..

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌‍లో బైభీమ్.. సినిమా ఘటన చోటుచేసుకుంది. రామోజీ తండాకు చెందిన ధరావత్ వీర శేఖర్‌ని.. ఓ దొంగతనం కేసులో అకారణంగా ఇరికించారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌‍లో బైభీమ్ సీన్.. గిరిజన యువకుడిపై పోలీసుల ప్రతాపం..
Atmakur Police Beat
Follow us

|

Updated on: Nov 11, 2021 | 2:03 PM

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌‍లో బైభీమ్.. సినిమా ఘటన చోటుచేసుకుంది. రామోజీ తండాకు చెందిన ధరావత్ వీర శేఖర్‌ని.. ఓ దొంగతనం కేసులో అకారణంగా ఇరికించారు. ఇంటరాగేషన్ పేరుతో చావబాదారు. దీంతో మండలంలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు ఆందోళన చేపట్టారు. మహేశ్ అనే కానిస్టేబుల్‌తో కలిసి ఎస్సై లింగం.. ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మోటార్ల దొంగతనం ఆరోపణ కేసులో.. నిన్న పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ పేరుతో చావబాదారు. పోలీసు దెబ్బలకు తాళలేక.. వీర శేఖర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. బంధువులకు సమాచారమిచ్చారు. శేఖర్.. బంధువులు వచ్చే సరికి.. జై భీమ్ సినిమాలో ఎలాగైతే.. మునికందన్ పడిపోయి ఉన్నాడో.. సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాడు.

దీంతో ఒక్కసారిగా.. ఆగ్రహానికి గురైన బంధువులు ఆందోళనకు దిగారు. సంబందంలేని దొంగతనం ఒప్పుకోవాలని బలవంతం చేసే క్రమంలో వీర శేఖర్ ని చిత్రహింసాలకు గురి చేయాడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు.. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుంటే తమ ట్రాక్టర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎస్సై లింగం, కానిస్టేబుల్ మహేశ్ పై చర్యలు తీసుకోవాలని రామోజీ తండా గిరిజనులు కోరుతున్నారు. ఆపస్మారక స్థితిలో ఉన్నా వీర శేఖర్.. ప్రస్తుతం సూర్యపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి: Makeup Tips: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు గ్రేస్‌ఫుల్ లుక్..

SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..

Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృ‌ఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..