ఆ సంస్థకు బాకీ పడ్డ పవన్.. ఇప్పుడైనా తీరుస్తాడా..?

తన కుటుంబం కోసం, తన పార్టీకి ఆర్థిక పుష్టి కోసమే తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానంటూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు సినిమాలకు పవన్ ఓకే చెప్పారు. వీటిలో రెండింటి షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు మరో రెండు చిత్రాలను కూడా పవన్ ఒప్పుకున్నట్లు టాక్. అంతేకాదు వీటిలో ఒక్కో చిత్రానికి పవన్ రూ.50కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ రీ […]

ఆ సంస్థకు బాకీ పడ్డ పవన్.. ఇప్పుడైనా తీరుస్తాడా..?

తన కుటుంబం కోసం, తన పార్టీకి ఆర్థిక పుష్టి కోసమే తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానంటూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు సినిమాలకు పవన్ ఓకే చెప్పారు. వీటిలో రెండింటి షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు మరో రెండు చిత్రాలను కూడా పవన్ ఒప్పుకున్నట్లు టాక్. అంతేకాదు వీటిలో ఒక్కో చిత్రానికి పవన్ రూ.50కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ రీ ఎంట్రీతో ఇటు ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా మరికొందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా ఓ సంస్థ‌ పవన్ రీ ఎంట్రీపై ఆశలు పెట్టుకుందట. సినిమాల్లోకి రావడం ద్వారా తమకు అప్పుబడ్డ భాకీని పవన్ తీరుస్తాడని ఆ సంస్థ భావిస్తుందట.

ఇక అసలు మ్యాటరేంటంటే..! అప్పుడెప్పుడో పార్టీని ప్రకటించిన పవన్.. గతేడాది ఎన్నికల బరిలో నిలిచి ఘోర పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికలకు ముందు తన పార్టీని ప్రచారం చేసుకోవడం కోసం అమెరికాకు చెందిన ఓ సంస్థతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ సంస్థ సోషల్ మీడియాలో జనసేన పార్టీకి విస్తృత ప్రచారాన్ని చేసిందట. ఇందుకోసం ఓ ఆఫీస్‌ను పెట్టడంతో పాటు కొంతమంది ఉద్యోగులను కూడా ఆ సంస్థ నియమించుకుందట. ప్రచారం ముగిసేవరకు ఈ సంస్థకు రూ.5కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన బిల్లును కొన్ని నెలల క్రితమే పవన్‌కు పంపారట. అయితే దీనిపై పవన్ నుంచి గానీ, జనసేన పార్టీ నుంచి గానీ ఎలాంటి సమాధానం రాలేదట. ఇక ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడంతో.. ఇప్పుడైనా తమ భాకీని ఆయన తీరుస్తాడని ఆ సంస్థ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.

Published On - 1:42 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu