హైకోర్టును ఆశ్రయించిన రజనీ దర్శకుడు.. ఎందుకంటే!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్టార్ దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘దర్బార్’. పలు వివాదాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీని భారీ రేటు చెల్లించి వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే సరైన కలెక్షన్లు లేకపోవడంతో దాదాపుగా 25 కోట్లమేర వినియోగదారులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. […]

హైకోర్టును ఆశ్రయించిన రజనీ దర్శకుడు.. ఎందుకంటే!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్టార్ దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘దర్బార్’. పలు వివాదాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీని భారీ రేటు చెల్లించి వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే సరైన కలెక్షన్లు లేకపోవడంతో దాదాపుగా 25 కోట్లమేర వినియోగదారులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తమ నష్టాలను దర్శకుడు మురగదాస్, హీరో రజనీకాంత్ భరించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మురగదాస్‌ను కలిసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం కాస్త రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో మురగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోర్టుకు వినతి చేశారు. కాగా తెలుగులోనూ ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే.

Published On - 12:59 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu