ఆ ఇద్దరిలో చెర్రీ ఫస్ట్ ఛాన్స్ ఎవరికో..!

‘ఆర్ఆర్ఆర్‌’ విడుదల తేదీపై రాజమౌళి టీమ్ స్పష్టతను ఇచ్చేసింది. విడుదల తేదీని ఏకంగా ఐదు నెలలకు పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పష్టతను ఇచ్చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ వేసవికి దాదాపుగా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వేరే చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారట. అందుకోసం ప్రస్తుతం కథలు వింటున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్. ఈ క్రమంలో […]

ఆ ఇద్దరిలో చెర్రీ ఫస్ట్ ఛాన్స్ ఎవరికో..!

‘ఆర్ఆర్ఆర్‌’ విడుదల తేదీపై రాజమౌళి టీమ్ స్పష్టతను ఇచ్చేసింది. విడుదల తేదీని ఏకంగా ఐదు నెలలకు పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ స్పష్టతను ఇచ్చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ వేసవికి దాదాపుగా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వేరే చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారట. అందుకోసం ప్రస్తుతం కథలు వింటున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్. ఈ క్రమంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తుండగా.. చెర్రీ ఇద్దరు దర్శకులను లైన్‌లో పెట్టాడట.

సాహో దర్శకుడు సుజీత్, జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి‌లు చెర్రీకి ఇప్పటికే కథలను చెప్పారట. ఈ రెండు కథలు చెర్రీకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుజీత్‌కు పూర్తి కథను తయారుచేసుకొని రమ్మని రామ్ చరణ్ చెప్పాడట. మరోవైపు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో జెర్సీ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీ రిజల్ట్‌ను బట్టి అతడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి ఈ ఇద్దరిలో మొదటి అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్వకత్వం వహిస్తోన్న చిరు 152వ చిత్రంలోనూ చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో దాదాపు అరగంట పాటు చెర్రీ కారెక్టర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపుగా 45 రోజుల క్యాల్షీట్లను ఇచ్చాడు చెర్రీ. ఇక ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.

Published On - 12:33 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu