కరోనా ఎఫెక్ట్.. టాప్ హీరో షూటింగ్‌కు బ్రేక్

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 26 దేశాలకు కరోనా విస్తరించగా.. ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 563కు చేరింది. ముఖ్యంగా చైనాలో ఈ వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక భారత్‌లోనూ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ ఎఫెక్ట్‌తో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సినిమా షూటింగ్ ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున వైల్డ్‌ డాగ్ అనే […]

కరోనా ఎఫెక్ట్.. టాప్ హీరో షూటింగ్‌కు బ్రేక్

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 26 దేశాలకు కరోనా విస్తరించగా.. ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 563కు చేరింది. ముఖ్యంగా చైనాలో ఈ వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక భారత్‌లోనూ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ ఎఫెక్ట్‌తో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సినిమా షూటింగ్ ఆగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున వైల్డ్‌ డాగ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ముగియగా.. తదుపరి షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో ప్లాన్ చేశారు. అయితే అక్కడ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఈ షెడ్యూల్‌ను వాయిదా వేశారట. కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని చిత్రయూనిట్ నిర్ణయం తీసుకుందట. ఒకవేళ ఎక్కువ రోజులు అయ్యేలా ఉంటే.. ఆ లోపు మిగిలిన ఏరియాల్లో షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టి, మళ్లీ ఫాంలోకి రావాలని నాగార్జున భావిస్తున్నారు.

Published On - 12:01 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu